Union government questions about state councils

Union Government questions about State Councils, Center for Uniform system on State Councils, 7 out of 29 states have councils at present

Union Government questions about State Councils

శాసనమండలి ఎందుకు మీకు? అవసరమా?

Posted: 07/19/2014 09:45 AM IST
Union government questions about state councils

రాష్ట్రాలకు శాసన మండలి అవసరమా అని కేంద్ర ప్రభుత్వం అడగోతోంది.  కొన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళున్నాయి, కొన్ని రాష్ట్రాలలో లేవు.  అన్ని రాష్ట్రాలలో ఒకే పద్ధతిలో జరగాలి కదా అంటోంది కేంద్రం.  దీని మీద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మోదీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది.  

ప్రస్తుతం దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు మండళ్ళు వద్దని చెప్పినట్లయితే భవిష్యత్తులో శాసన మండళ్ళు కనుమరుగైపోతాయి.  ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్ళు పనిచేస్తున్నాయి.  కొత్తగా అస్సోం, రాజస్తాన్ రాష్ట్రాలు శాసన మండలిని ప్రారంభించటానికి అనుమతి కోరటంతో అసలు ఈ మంఢళ్ళు అవసరమా అనే ప్రశ్న కేంద్ర సర్కార్ కి మొదలైంది.  

ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ శాసన మండళ్లు ఉండాలి, లేకపోతే ఎక్కడా వద్దు.  దీనిమీద మీ అభిప్రాయం తెలియజేయండంటూ కేంద్రం అడుగుతోంది.  

ఒకవేళ 15 రాష్ట్రాలకు పైన వద్దంటే అన్ని రాష్ట్రాలలోను రద్దే.  కానీ కావాలంటే మాత్రం అన్ని రాష్ట్రాలలోనూ మండళ్ళు పనిచేయటమే కాకుండా మండలి అధికారాలను పునర్నిర్వచించాల్సి వుంటుందని కూడా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.  బిల్లులు పాస్ చెయ్యటంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానం వేరుగా ఉంది.  అందువలన కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉండాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా శాసన మండలి అధికారాలు, పరిధి లాంటి అంశాలను ఆలోచించి నిర్ణయించవలసివుంటుంది.  

అయితే శాసన మండలి ఏర్పాటు చెయ్యాలన్నా, రద్దు చెయ్యాలన్నా, రాజ్యాంగంలోని ఆర్టికిల్ 168, 169 లను సవరించవలసివుంటుంది.  

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో మండలి సభ్యులను టీచర్లు, పట్టభద్రులు, స్థానిక సంస్థలు, గవర్నర్ కోటా ల ద్వారా ఎన్నుకుంటున్నారు.  దాని స్థానంలో ఒకవేళ మండళ్ళు ఉండేటట్లైతే, కేంద్రంలో ఉన్నట్లుగానే రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే రీతిలో మార్పులు చెయ్యవలసివుంటుందని కేంద్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘమైన లేఖ అన్ని రాష్ట్రాలకూ పంపించటం జరిగింది.  

ఆ లేఖ మీద రాష్ట్రాలు స్పందించినదాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సారి పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పెట్టే అవకాశం ఉంది.  ప్రస్తుతం శాసన మండళ్ళున్న రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles