Tamilnadu finance minister panneerselvam to become next cm

O. Panneer selvam, Tamilnadu CM, conviction, Jayalalitha, disproportionate asset case

tamilnadu finance minister panneerselvam to become next cm

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం..

Posted: 09/28/2014 04:18 PM IST
Tamilnadu finance minister panneerselvam to become next cm

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అత్యంత ప్రీతిపాత్రుడు, విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ సెల్వంకే తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు దక్కాయి. అదాయానికి మించిన ఆస్థుల కేసులో బెంగళూరు అగ్రహార కోర్గు జయలిలతను దోషిగా తేల్చడంతో ఆమె జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారన్న ఉత్కంఠకు తెర పడింది. పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే పక్ష నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి అధ్యక్ష్త వహించిన పన్నీర్ సెల్వం.. తమ అధినేత్రి జయలలిత లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. అ తరువాత జరిగిన సమావేశంలో ఆయననే అన్నాడీఎంకే శాసనసభాపక్షం తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పన్నీర్ సెల్వంకే ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయానికి వచ్చిన పార్టీ అధినేత్రి జయలలిత.. ఇవాళ ఉదయం సీల్డ్ కవర్ లో ఆయన పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ కు పంపించారు.

 'అమ్మ' ఆదేశాల  మేరకు  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి పలువురు పేర్లు వినిపించినా 'విశ్వాసపాత్రుడు' వైపే పురచ్చితలైవి మొగ్గుచూపారు. గతం(2001)లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు కూడా పన్నీరు సెల్వంకే ఆమె ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. 2001లో అరు నెలల పాటు ముఖ్యమంత్రి బాధ్యతలను అధిరోహించిన పన్నీర్ సెల్వం.. ఆ తరువాత మద్రాసు హైకోర్టు తీర్పును వెలువరించగానే.. తాను పదవికి రాజీనామా చేసి జయలలితకు అప్పగించారు. ఎంజీఆర్ హయాం నుంచి జయలలితకు అత్యంత విశ్వసనీయపాత్రుడిగా ఉన్న పన్నీర్ సెల్వంకే ముఖ్యమంత్రి పీఠం దక్కడంతో ఆయన ఈ పదవిని రెండో సారి అధిరోహించనున్నారు. ప్రస్తుతం పన్నీరు సెల్వం జయలలిత క్యాబినెట్ లో అర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పన్నీరు సెల్వంను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న అన్నాడిఎంకే పక్ష నేతలు, గవర్నర్ రోశయ్యను కలసి, పన్నీర్ సెల్వంను తమ నేతగా ఎన్నుకున్నట్లు సమాచారం అందించనున్నారు. ఆ తరువాత పన్నీర్ సెల్వం రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O. Panneer selvam  Tamilnadu CM  conviction  Jayalalitha  disproportionate asset case  

Other Articles