Presidents rule imposed in maharashtra for the second time

maharashtra, president rule, union cabinet. congress, NCP, Pranab Mukhurjee

presidents rule imposed in maharashtra for the second time

మహారాష్ట్రలో రెండో సారి రాష్ట్రపతి పాలన విధింపు

Posted: 09/28/2014 04:27 PM IST
Presidents rule imposed in maharashtra for the second time

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం నిన్న చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ ఆమోదముద్ర వేశారు. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మధ్య రేగిన సీట్ల సర్థుబాటు వ్యవహారాం కాస్తా చిలికి చిలికి రాజకీయ సంక్షోభానికి తెరలేపింది. తమ అంగీకారం లేకుండా కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఎన్సీపీ కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకుంది. దీంతో మహారాష్ట్రలోని పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.

సరిగ్గా ఎన్నికల ముందు అందివచ్చిన అవకాశాన్ని పునికిపుచ్చుకున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తంది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి మండలి దీనిని అమోదం తెలపడంతో పాటు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. దీనికి అమోదం తెలిపిన రాష్ట్రపతి అమోదముద్ర వేశారు. దీంతో మహారష్ట్రలో రెండో పర్యాయం రాష్ట్రపతి పాలన విధించబడింది. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శరద్ పవర్ వుండగా, ఆయన ప్రభుత్వం మైనారిటిలో వుందని అరోపణలు వెలువెత్తిన తరుణలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 17 పిబ్రవరి 1980లో మహారష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.

అక్టోబర్ 15న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపి, కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు పదిహేను సంవత్సరాల తరువాత ఒంటరిగానే బరిలో నిలుస్తుండడంతో ఎన్నికలలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న (శనివారం) నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రకు 7 వేల 4 వందల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా అన్ని స్థానాల నుంచి స్వతంత్ర్య అభ్యర్థులు అధిక స్థానాలలో పోటీ పడుతున్నారు. వీటిలో అత్యధికంగా నాందేడ్ దక్షిణ అసెంబ్లీ స్థానం నుంచి 92 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, గుహగర్ అసెంబ్లీ స్థానం నుంచి అత్యల్పంగా కేవలం 9 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra  president rule  union cabinet. congress  NCP  Pranab Mukhurjee  

Other Articles