Villagers quarrelling for tiger flesh

Tiger flesh, villagers quarreling, saravakota, srikakulam district, wild cat

villagers quarrel for tiger flesh, forest officials say it is not a tiger, just a wild cat

అది పులి మాంసం కాకపోతే... మరేంటి..?

Posted: 09/28/2014 05:14 PM IST
Villagers quarrelling for tiger flesh

దారి తప్పి వచ్చిన ఓ పులిని చంపిన గ్రామాస్థులు.. పులి మాంసం వాటాలుగా పంచుకునే క్రమంలో గోడవ పడ్డారు. గ్రామస్తుల మధ్య వివాదం కాస్త పెద్దదై పోలీసు స్టేషన్ చేరింది. తీరా చూస్తే అది పులి కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. అయితే అదేంటి..? వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బకిరికొండ ప్రాంతానికి ఒడిశా నుంచి దారితప్పి ఓ పులి వచ్చింది. ఉత్తరాంధ్రలో ప్రవేశించిన ఆ పులి రైవాడ కొండ ప్రాంతంలో సంచరిస్తుందన్న సమాచారంతో రైతులు దానిని చంపాలని నిర్ణయించుకున్నారు. రైతులు అనధికారికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలో అది చిక్కుకుని.. విద్యుత్ షాక్తో మృతి చెందింది. దీంతో ఆ పులి మాంసాన్ని గ్రామస్తులు పంచుకోవాలని నిర్ణయించారు.

ఆ మాంసం పంచుకునే క్రమంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సదరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పులి మృతి చెందిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి... గ్రామస్తుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పులి చర్మం, గోళ్లు ఏమైనాయి అనే అంశంపై మాత్రం గ్రామస్తులు పెదవి విప్పడం లేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గ్రామస్తులను విచారిస్తున్నారు. ఇంతలో అసలు విషయాన్ని నింపాదిగా చెప్పారు అటవీశాఖ అధికారులు. అది పులి కాదని తేల్చేశారు. అయితే అది మరేంది. అది అడవి పిల్లి అని చెప్పారు. ఇకనేం మాకు మాంసం వద్దంటే వద్దంటూ అక్కడున్న గ్రామస్థులు అన్నారు.

అయితే దారి తప్పి వచ్చిన పులిని చంపడానికి కూడా వెనుకాడని గ్రామస్థులపై పోలీసుల కేసులు నమోదు చేశారు. పిల్లినే కదా మేం చంపిందని వారు వాదిస్తున్నా.. అడవి మృగాలను చంపడానికి అధికారంలో ఎవరికీ లేదంటూ తేల్చిచెబుతున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger flesh  villagers quarreling  saravakota  srikakulam district  wild cat  

Other Articles