Ambati rambabu slams tdp government over expenditure

ambati rambabu, expenditure, tdp government,

ambati rambabu slams tdp government over expenditure

ఇదేనా.. నీ పొదుపు మంత్రం బాబూ...?

Posted: 09/28/2014 07:09 PM IST
Ambati rambabu slams tdp government over expenditure

రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రజలు త్యాగాలు చేయాలని నమ్మబలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రాబాబు.. ఆచరణలో మాత్రం ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాత్కాలిక చాంబర్ల, టీవీలు, కార్ల కోసం ప్రజాధనాన్ని నీరులా ఖర్చు చేస్తున్న బాబుకు పోదుపు మంత్రాలు జపించే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు, ప్రభుత్వం చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి చెడ్డ పనులని విమర్శించారు.

 ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరుగుతోందని ఆరోపించారు. మంత్రి యనమల తన చాంబర్ కసం రూ.80 లక్షలు ఖర్చు చేశారని, ఒక్క టీవీ కోసమే రూ. 4లక్షలు వెచ్చించారని ఇదే అందరు మంత్రులు చేస్తే రాష్ట్ర ఖజానాకు చిల్లు పడడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు.

స్పీకర్ కోడెల స్టడీటూర్ల పేరిట జోహెన్నెస్ బర్గ్, కేప్ టౌన్, కెన్యా, మారిషస్ వెళ్తున్నారని చెప్పారు. ఆ దేశాల్లో చట్టసభల తీరు గురించి మనం తెల్సుకోవాల్సింది ఏముందని ప్రశ్నించారు. రాజధాని కోసం చందాలు వసూలు చేస్తున్న దశలో ఇంత ఖర్చు దేనికి అని నిలదీశారు. దుబారా ఖర్చులు చేయకుండా పునరాలోచన చేయాలని అంబటి సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambati rambabu  expenditure  tdp government  

Other Articles