Shops that sell weapons in open market

AK 47, Machine guns, Pakistan, Darra Adam Khel, open market, weapons

shops that sell weapons in open market in pakistan

అంగళ్లలో అమ్మకానికి అక్రమ ఆయుధాలు..

Posted: 09/28/2014 07:12 PM IST
Shops that sell weapons in open market

మన దేశం కిరాణా షాపుకెళ్లి.. పప్పులు ఉప్పులు కొంటాం.. అదే ఇక్కడికెళ్తే.. ఏకే 47లు, మెషీన్ గన్లు, పిస్టళ్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ కిరాణా షాపులున్నట్లే.. అక్కడ ఆయుధాలు అమ్మే దుకాణాలు ఉంటాయి..! ఇంతకీ ఎక్కడ? దర్రా ఆదం ఖేల్ అనే చిన్న పట్టణమే.. అయితే.. అక్రమ ఆయుధాలకు అది అతిపెద్ద అడ్డా.  ఇక్కడ ప్రధాన వీధికి రెండు వైపులా దుకాణాలు. అన్నీ ఆయుధాలను అమ్మేవే! ఇక్కడి ప్రజల్లో 75 శాతం మంది ఇదే బిజినెస్‌లో ఉన్నారు. ఏ మోడల్ గన్‌ను అయినా.. ఇక్కడ లోకల్‌గా దొరికే సామాన్లతో వీరు డూప్లికేట్‌ను తయారుచేసేసి అమ్మేస్తారు. పెన్నుల్లో ఇమిడిపోయే గన్‌ల దగ్గర్నుంచి.. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాల వరకూ అన్నీ..  గత 150 ఏళ్లుగా ఇక్కడి బిజినెస్ మూడు గన్నులు ఆరు గ్రనేడ్లుగా వర్థిల్లుతోంది.

ఇదంతా బాగానే చెప్పారు. ఇంతకీ దర్రా ఆదం ఖేల్ అనే పట్టణం ఎక్కడుంది అనేగా మీ డౌట్..? అక్కడికే వస్తున్నాం.. ఇది ఉద్రవాదుల ఖిల్లాగా పేరోందిన పాకిస్థాన్ లోనే వుంది. ఇంత బహిరంగంగా మార్కట్లో సరుకుల మాదిరిగా ఆయుధాలను విక్రయిస్తున్నా.. అక్కడి ప్రభుత్వ వారిని ఉపేక్షిస్తుంది. ముఖ్యంగా తాలిబన్లు వంటి టైస్టులు వీరి వద్ద నుంచి ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తారని చెబుతారు. కొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని పాక్ ప్రభుత్వం.. చివరికి ఈ ఆయుధాలను టైస్టులు తమపైకి గురిపెట్టేసరికి.. కొన్నిసార్లు దాడులు జరిపింది. భారీ ఆయుధాల తయారీని నిషేధించింది. అయినప్పటికీ.. షరామామూలే..

ఇదంతా చాలదన్నట్లు ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ కాశ్మీర్ ప్రజలు బలవంతంగా తమ బతుకులు ఈడుస్తున్నారని కన్నీరు కారుస్తున్నారు. భారత్ గురించి తరువాత బాధ పడువచ్చు గానీ.. ముందుగా దర్రా ఆదం ఖేల్ లో అక్రమ ఆయుధాల విక్రయాలను నియంత్రిస్తే చాలునని పలువరు భారతీయ మేధావులు సూచిస్తున్నారు.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AK 47  Machine guns  Pakistan  Darra Adam Khel  open market  weapons  

Other Articles