Judas come down for talks with government

juda strike, junior doctors strike in telangana, juda on telangana goverment, telangana government on junior doctors strike, highcourt on junior doctors strike, latest news, tealangana latest news

judas come down for talks with government : junior doctors in telagnana making voice low with highcourt orders and serious comments on theirs strike, juda decides to make a talk with government again to solve their problems

చర్చలకు సిద్ధమైన జుడాలు

Posted: 10/28/2014 09:55 AM IST
Judas come down for talks with government

తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు దిగి వస్తున్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చలకు సిద్ధం అవుతున్నారు. గతంలోనే పలుమార్లు చర్చలు విఫలం అయిన నేపథ్యంలో తాజా చర్చల్లో ఏం జరుగుతుందో అని జుడాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సమ్మె విరమణకు హైకోర్టు, రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తున్న నేపథ్యంలో తాజా చర్చలతో తమ డిమాండ్లను పరిష్కరించుకుని విధులకు హాజరుకావాలని వైద్య విద్యార్థులు భావిస్తున్నారు.

ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాలు/ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలన్న నిబందనను వ్యతిరేకిస్తూ జుడాలు సమ్మె బాట పట్టారు. ఈ ఆందోళనపై ప్రభుత్వం మొదటి నుంచి ఆగ్రహంగా ఉంది. గ్రామాల్లో సేవలు అందించాల్సిందే అని స్పష్టం చేసింది. అటు గ్రామాల్లో తాత్కాలిక పద్దతిలో కాకుండా శాశ్వతంగా సేవలు అందించేందుకు తాము సిద్ధమని జుడాలు చెప్తూ వచ్చారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మెలోకి వెళ్ళారు. అయితే సమ్మె చేస్తున్న విద్యార్థులపై ఆగ్రహించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. స్కాలర్ షిప్పులు నిలిపివేయటంతో పాటు, విద్యార్థులను తాత్కాలికంగా నిషేధించే ప్రతిపాదనలు పరిశీలించాలని వైద్య విద్య శాఖను సీఎం ఆదేశించారు. అటు హైకోర్టు కూడా ఈ సమ్మెను తప్పుబట్టింది. సమ్మె చేయటానికి మీరేమైనా ఉద్యోగులా అని ప్రశ్నించింది. జుడాలకు సమ్మె చేసే హక్కు లేదు అని కోర్టు స్పష్టం చేసింది. తక్షణమే విధుల్లో చేరకుంటే ఏ చర్యలైనా తీసుకునేందుకు వెనకాడమని హెచ్చరించింది.

ఇలా తమకు న్యాయం జరుగుతుంది అని సమ్మె చేస్తే.., మొదటికే మోసం వచ్చి భవిష్యత్తు ప్రమాదంలో పడటంతో జుడాలు అప్రమత్తం అయ్యారు. సమ్మెను వీడే ముందుగా ఓ సారి ప్రభుత్వంతో చర్చలు జరపాలని భావిస్తున్నారు. ఇవాళ్టితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంతో తమ డిమాండ్లపై హామిలు తెచ్చుకోవాలని సంకల్పంతో ఉన్నారు. అయితే గతంలోనే జుడాల డిమాండ్ ను ఆమోదించమని సర్కారు తెగేసి చెప్పింది. తాజాగా కోర్టు తీర్పు కూడా తోడు కావటంతో వైద్య విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరి ఇవాళ్టి చర్చల్లో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో..,. జుడాల హామీలపై ఏమంటుందో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangan  juda  highocourt  talks  

Other Articles