Radha s timblo donations to congress and bjp

radha s timblo black money, radha s timblo black money value, radha s timblo in black money holders list, radha s timblo donations to congress and bjp, donations to political parties, latest news, central governemnt on black money holders

Radha S Timblo donations to congress and bjp : one of first black money listed person radha s timblo had given donations to congress and bjp earlier. radha s timblo made donations to congress and bjp but her name listed in black money holders list

నల్ల కుభేరుల నుంచి కాంగ్రెస్, బీజేపిలకు విరాళాలు

Posted: 10/28/2014 11:19 AM IST
Radha s timblo donations to congress and bjp

ఎన్డీయే ప్రభుత్వం తొలి దశలో ముగ్గురు నల్ల కుభేరుల జాబితాతో కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. వీరు ప్రదీప్ బర్మన్, పంకజ్ చమన్ లాల్,  రాధా ఎస్ టింబ్లోగా కేంద్రం కోర్టుకు తెలిపింది. వీరిపై వచ్చిన ఆరోపణలను ముగ్గురూ ఖండించారు. కాగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. నల్ల కుభేరుల జాబితాలో ఉన్న రాధా ఎస్ టింబ్లో నుంచి అధికార పక్షంకు డబ్బులు ముట్టాయని. అంటే పార్టీ విరాళంగా రాధా బీజేపికి డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు ప్రతిపక్షం బీజేపికి కూడా రాధా ఎస్ టింబ్లో విరాళాలు ఇచ్చింది.

గోవాలో ప్రముఖ మైనింగ్ కంపనీని నిర్వహిస్తున్న టింబ్లో 2004-12 మద్య పలు దఫాలుగా బీజేపికి రూ.1.18కోట్ల రూపాయలు విరాలంగా అందించటం జరిగింది. బీజేపీకి ఇచ్చిన విరాళాల్లో మూడు దఫాలుగా రూ. 25 లక్షల చొప్పున ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్ చెక్కుల ద్వారా టింబ్లో రూ.75 లక్షలను అందజేశారు. ఇక కాంగ్రెస్ కు రూ. 65లక్షలు మొత్తం మూడు విడతలుగా అందించింది. ఈ లెక్కలు రెండు పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల జాబితా ద్వారా తెలుస్తున్నాయి.

ఇలా నల్ల కుబేరుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పార్టీలు.., దాతలు చేసే చీకటి పనులను చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు రాధా గురించి తెలిసే డబ్బు తీసుకున్నాయా..? లేక కేవలం విరాళం ఇస్తుందన్న అంశం మాత్రమే పరిగణలోకి తీసుకున్నాయా.. అనేద తెలియాల్సి ఉంది. మొత్తం మ్మీద అవినీతిపై పోరాడాము అని చెప్పుకుంటున్న రెండు పార్టీలకు అవినీతి సొమ్ము విరాళంగా వచ్చిందన్న వార్తతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ డబ్బు అక్రమం అని తెలిసిన నేపథ్యంలో విరాళాలు వెనక్కి ఇచ్చి తమ సచ్చీలత నిరూపించుకుంటాయా... లేక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరా అనేది చూడాలి. అటు ముగ్గురిలో ఒకరు రెండు పార్టీలకు విరాళం ఇచ్చిన వ్యక్తి ఉండటంతో మొత్తం జాబితా వెల్లడయితే ఎంతమంది నల్లకుభేరులు పార్టీలకు అండగా నిలిచారు అనేది తేలుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radha s timblo  black money  congress  bjp  

Other Articles