Telanagna nominated posts filled by telangana government ex dgp will be as tourism chairman

ex dgp, pervaram ramulu, telanagna government, telangana nominated posts

ex dgp pervaram ramulu as tourism chairman

పేర్వారం రాములుకు నామినేటెడ్ పోస్ట్

Posted: 12/29/2014 10:01 AM IST
Telanagna nominated posts filled by telangana government ex dgp will be as tourism chairman

తెలంగాణ లో పదవుల పంపిణీ జోరుగానే సాగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన తెలంగాణా ప్రభుత్వం త్వరలో మరి కొన్ని నామినేటెడ్ పోస్టులను భారతి చేయనున్నట్లు తెలుస్తుంది. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఈ పదవుల కోసం, కెసిఆర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో కొందరు మాజీ ఎం.ఎల్.ఏ లు కూడా ఉన్నట్లు సమాచారం. కొందరు బహిరంగంగానే తమకు ఈ పలానా నామినేటెడ్ పోస్ట్ కావాలని, ఉద్యమం కోసం ఎంతో కష్ట పడ్డామని కనీసం ఇప్పుడు కూడా పదవి రాకుంటే ప్రజల్లోకి ఏ విధంగానూ వెళ్ళలేమని కెసిఆర్ దగ్గర వాపోతున్నట్లు తెలుస్తుంది.

మళ్ళి ఇప్పుడు తాజాగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ డిజిపి పేర్వారం రాములును నియమించవచ్చని సమాచారం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎపిపిఎస్సి చైర్మన్ గా రాములు పనిచేశారు. కొంతకాలం టిడిపిలో ఉండి, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ లో చేరిన పలువురు బ్యూరోకాట్రకు ఇప్పటికే పదవులు వచ్చాయి. రమణాచారి, విద్యాసాగరరావు, గోయల్ తదితరులు వీరిలో ఉన్నారు. తాజాగా రాములుకు కూడా అవకాశం వచ్చింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ex dgp pervaram ramulu  nominated post  tourism chairman  

Other Articles