Woman businessman hulchul in old alwal

woman hulchul in old alwal, woman businessman hulchul, police arrested woman businessman, women businessman caught drunk and drive, woman businessman held drunk and drive, woman businessman causes damage to vehicles, 4 injured in woman businessman hulchul

police arrested woman businessman, for drunk and drive and causing damage to two and four wheelers in old alwal

ITEMVIDEOS: మద్యం మత్తులో మహిళ హల్చల్..

Posted: 01/04/2015 12:34 PM IST
Woman businessman hulchul in old alwal

మద్యం మత్తులో ఓ మహిళా పారిశ్రామికవేత్త  అర్థరాత్రి హల్చల్ సృష్టించింది. అతిగా మద్యం సేవించడమే కాకుండా అతి వేగంతో కారు నడుపుతూ వీరంగం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కోట్టి ఆపకుండా వేగంగా తప్పించుకునేందుకు యత్నించింది. అమెను వెంబడించి పట్టుకున్న యువకులపైనే తిరగబడింది. అమె అతి వేగానికి, రాష్ డ్రైవింగ్ కు మూడు కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

అయితే అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించి విఫలమైన మహిళ పారిశ్రామికవేత్తను స్థానికులు పట్టుకుని ఓల్డ్ అల్వాల్ పోలీసులకు అప్పగించారు. ఆమెపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. ఆదివారం ఆమెను పోలీసులు విచారించనున్నారు. సోమవారం ఆమెను కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఆమె కారు ఏపీ 10 ఏఏ 8511ను పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు.  మహిళ అతిగా మద్యం సేవించిందని తమ పరీక్షల్లో తెలిందని పోలీసులు వెల్లడించారు. కాగా నిందితురాలిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు రాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ కింద కూడా కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  woman businessman  drunk and drive  hulchul  

Other Articles