Airasia plane crash blamed on weather

AirAsia Plane crash, weather blamed for airasia crash, adverse weather cause airasia plane crash, weather factor behind airasia plane crash, indonesia blames weather on airasia crash, indonesia blames weather on plane crash, indonesia, air asia plane crash, adverse weather,

Bad weather was the biggest factor in the crash of AirAsia flight QZ8501, the Indonesian weather agency believes.

ప్రతికూల వాతావరణమే విమాన ప్రమాదానికి దారితీసింది..

Posted: 01/04/2015 12:37 PM IST
Airasia plane crash blamed on weather

ఎయిర్ ఏషియా విమాన ప్రమాదానికి అసలు కారణం ప్రతికూల వాతావరణమేనంటూ ఇండోనేసియా ప్రతినిధులు ప్రకటించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఎయిర్ ఏషియా విమానం కుప్పకూలడానికి ముఖ్య కారణమని ఇండోనేసియా వాతావరణ సంస్థ తెలియజేసింది. ప్రమాదం జరగడానికి ముందు పైలట్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించిన ఇండోనేషియా ప్రభుత్వం ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది.

ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న 162 మంది మరణించారని భావిస్తున్నారు. కొన్ని మృతదేహాలను వెలికితీయగా, మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల విమానం ఇంజిన్ చెడిపోయిఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ఇదీ ఒక కారణమని, అయితే విమానం కూలిపోవడానికి కచ్చితమైన కారణమేంటన్నది తేలాల్సివుందని వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia crash  Indonesia  Weather  

Other Articles