Delhi assembly polls underway

delhi assembly polls underway, Aam Aadmi Party, AAP, Ajay Maken, Arvind Kejriwal, BJP, Congress, Delhi Assemly Election 2015, Delhi voters, Economically Weaker Sections, kiran bedi, Lower middle class, MIddle Class, Rahul Gandhi, President Pranab Mukherjee,

delhi assembly polls underway, President Pranab Mukherjee casts vote as polling begins

హస్తిన పోలింగ్: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Posted: 02/07/2015 10:02 AM IST
Delhi assembly polls underway

దేశ రాజధాని మరో కీలక ఘట్టానికి సిద్దమైంది. హస్తిన పీఠాన్ని అధిరోహించడానికి అప్, బీజేపిలు తుది అంకంలోకి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఎనమిది గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్నాయి.  ఢిల్లీ భవితవ్యాన్ని తేల్చేందుకు నగర వాసులు సిద్దమయ్యారు.  ఆమ్ఆద్మీ, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర మహాషయులు ఇవాళ తీర్పును ఇవ్వనున్నారు. ఎవరిని గద్దెనెక్కించాలన్న విషయమై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఓటర్లు వారి తీర్పును ఇవాళ ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 673 మంది అభ్యర్థుల వారి జాతకాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు. అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంలలో భద్రపర్చేందుకు ఓటర్లు అప్పుడే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. దాదాపు కోటి 33 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి 12వేల 177 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా 55 వేల మంది పోలీసులను మోహరించారు.

నగరంలో 191 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 550 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. వీటితో పాటు పోలింగ్ కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టం చేశారు. దాదాపు 55 వేల మంది పోలీసులు, పారామిలటరీ దళాలను రంగంలోకి దించిన అధికారులు సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ బలగాలను కూడా మోహరిస్తున్నారు. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హస్తినలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన రాష్ట్రపతి తనయ షర్మిష్ట, కేంద్ర మంత్రి హర్షవర్థన్, బీజేపి నేతలు రాం మాదవ్, సతీష్ ఉపాద్యాయ్ తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి హర్షవర్థణ్ మీడియాతో మాట్లాడుతూ.. హస్తినలో బీజేపి తప్పక విజయ బావుటాను ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ సీఎం పదవిని చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ భేడీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఓటర్లు ప్రగతి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi-assembly-election-2015  Aam Aadmi Party  BJP  polling  

Other Articles