Pakistani hackers target gujarat government website

Pakistani hackers target Gujarat government website:, hackers from Pakistan hacked indian website, pak hackers target Gujarat Education Department website, hackers posted derogatory remarks on site, Prime Minister Narendra Modi, vidyasahayakgujarat.org, hacked website relaunched within hours, Pakistan-based hacker group, two websites of Hyderabad-based companies, 21 indian websites hacked by pakistan

A group of hackers from Pakistan hacked a website of the Gujarat Education Department today and posted derogatory remarks about the Prime Minister Narendra Modi on its homepage, a senior official said.

గుజరాత్ ప్రభుత్వ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన పాకిస్థాన్

Posted: 02/07/2015 10:26 AM IST
Pakistani hackers target gujarat government website

పాకిస్థాన్ మరోమారు నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ను టార్గెట్ చేసింది. పాకిస్థాన్ కు చెందిన పలువురు హ్యకర్ల బృందం గుజరాత్ ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. గుజరాత్ ప్రాథమిక విద్యాశాఖకు చెందిన వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన దుండగులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ..  అసభ్యపదజాలంతో పలు వ్యాఖ్యలను అందులో పోస్టు చేశారు. హ్యాకింగ్ సమాచారం అందుకోగానే రంగంలోకి దిగిన గుజరాత్ ఐటీ శాఖ కేవలం రెండు గంటల వ్యవధిలోనే వెబ్ సైట్ ను మరమ్మతులు చేసి సైట్ పునరుద్దరించారు.

గుజరాత్ ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రాథమిక విద్యాశాఖకు చెందిన విద్యా సహాయక్ గుజరాత్ . ఓఆర్ జీ సైట్ ను పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లే హ్యాక్ చేశారని దర్యాప్తు చేసిన గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. గుజరాత్ లో అక్షరాస్యతను తొలగించే క్రమంలో విద్యా సహాయకులు తమ దరఖాస్తులను అందించేందుకు ఈ వైబ్ సైట్ దోహదపడుతుంది. అయితే దీంతో పాటు భారత దేశంలోని మరో 21 ఇతర వైబ్ సైట్లను కూడా పాకిస్థాన్ హ్యాకర్లు హ్యక్ చేశారని, అందులో రెండు సైట్లు హైదరాబాద్ కేంద్రంగా వున్న పరిశ్రమలవి కూడా వున్నాయని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  pakistan  hackers  websites  

Other Articles