Pawankalyan tour in undavalli

pawankalyan, janasena, undavalli, capitalcity, land pooling,

pawankalyan tour in undavalley: janasena president pawankalyan tour to undavalli, commence grandly. pawankalyan listen the problems of the capital city villages problems.

మీ కోసం నేనున్నా.. కన్నీళ్లు తుడుస్తా.. పవన్ భరోసా

Posted: 03/05/2015 11:31 AM IST
Pawankalyan tour in undavalli

రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. తమ సమస్యలు వినడానికి వచ్చిన నిజమైన ప్రజానాయకుడిని చూడాలని రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. ఉదయం 7గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన పవన్ కళ్యాన్ 10గంటలకు ఉండవల్లి గ్రామానికి చేరుకున్నారు. గొప్ప రాజధాని కావాలని తనకు కూడా ఉందని, కానీ రైతు కన్నీరుతో వచ్చే రాజధాని అవసరం లేదని అన్నారు. రైతు శోకం పెడితే ఆ ఉసురు రాజధానికి తగులుతుందని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే నిలిపివెయ్యాలని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిలను పవన్ కోరారు. రైతులకు డైడ్ లైన్లు పెట్టి పొలాలను లాక్కోవద్దని హితవు పలికారు. రైతుల కన్నీరు తుడవడానికే తాను వచ్చానని ఆయన వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ముప్పై వేల ఎకరాల భూమి అవసరమా అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పవన్ పర్యటన సందర్భంగా భారీగా తరలివచ్చిన గ్రామస్తులు, అభిమానులతో ఉండవల్లి గ్రామం కిటకిటలాడింది. సభా వేదిక వద్దకు పవన్ కళ్యాన్ రాగానే అభిమానులు ఒక్కసారిగా సంబరపడ్డారు. తమ నాయకుడిని, అభిమాన నటున్ని చూడడానికి, కలుసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. దాంతో పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. పరిస్థితిని అదుపు చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో రంగంలోకి దిగిన పవన్ అభిమానులను, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. నేను మీ కోసమే వచ్చాను, మీ కన్నీళ్లు తుడవడానికే వచ్చాను అన్న మాటలతో సభా ప్రాంగణం ఒక్క సారిగా ఊగిపోయింది. అభిమానులు, గ్రామస్తులు, రైతులు భావేద్వేగానికి లోనయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో తమ నాయకుడికి సరైన భద్రత ఏర్పాటు చెయ్యలేదని పోలీసులపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస భద్రత కూడా కల్పించకుండా, కాన్వాయ్ లేకుండా వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులు భద్రతా సిబ్బందిగా మారారు. జనసేన పేరుతో పెట్టిన ఓ పార్టీ, ఇప్పుడు ప్రజల్లోకి చేరుతోంది. పవన్ కళ్యాణ్ తమ సమస్యలకు ఏదో పరిష్కారం చూపిస్తారని రాజధాని రైతుల కళ్లల్లో ఓ కొత్త వెలుగు కనిపిస్తోంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawankalyan  janasena  undavalli  capitalcity  land pooling  

Other Articles