Noneed to ban on the documentary

nirbhaya, delhi, gangrape,bbc,interview,mukesh, rajnathsingh,

why the government wanted to ban it. It is possible that they were fearing outrage and people taking to the streets after the telecast of the documentary. It could be a law and order concern for them. But for the truth to be known, it is necessary that the filth comes out too. The documentary has the comments of lawyers and other eminent people in society.

భారత్ లోని వ్యక్తుల ఆలోచనకు అద్దం ఆ డాక్యుమెంటరీ: నిర్భయ తండ్రి

Posted: 03/05/2015 11:58 AM IST
Noneed to ban on the documentary

ఇండియా డాటర్ డాక్యుమెంటరీ ని ప్రసారం చెయ్యడాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని  నిర్బయ తండ్రి ప్రశ్నించారు. అసలు డాక్యుమెంటరీని ప్రసారం చేస్తే కదా అసలు నిజాలు బయటికి వస్తాయని అన్నారు. ఆ డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాల్సినదని, భారతదేశంలో వ్యక్తుల ఆలోచన విధానానికి, సమాజానికి ఆ డాక్యుమెంటరీ అద్దం పట్టేదన్నారు. 2012లో తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని బీబీసీ డాక్యుమెంటరీ మరింత వివరంగా చూపుతుందని అన్నారు. ఘటన పట్ల భారత్ లో వచ్చిన నిరసనలు, ప్రముఖుల స్పందనలు ఇలా డాక్యుమెంటరీ ఇప్పటి వరకు చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని తెలిపారు.
 
'ప్రతి ఒక్కరు ఆ చిత్రాన్ని చూడాలి. జైలులో ఉన్న ఓ వ్యక్తి అలా మాట్లాడగలుగుతున్నాడంటే.. అతడిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంక ఏం మాట్లాడుతాడో ఊహించుకోండి' అని నిర్భయ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్నే ఆ డాక్యుమెంటరీ చూపించిందని, నేరస్తులపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం దానిని అంగీకరించడం తప్ప ఏమి చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. కాగా ఇండియా డాటర్  డాక్యుమెంటరీని బీబీసీ చానెల్కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీశారు. ఇందుకోసం వారు నిర్భయ తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని ప్రశ్నించి దీనిని రూపొందించారు. మొత్తం 28 మందిని ఇందులో ఇంటర్వూ చేశామని, అందులో నిర్భయ తల్లిదండ్రులు, నిందితులు, జైలు అధికారులు, లాయర్లు, ఢిల్లీ సిఎం ఇలా చాలా మందిని ఇంటర్వూలో ప్రశ్నించామని లెస్లీ ఉడ్విన్ తెలిపారు. మరోపక్క డాక్యుమెంటరీ ప్రసారమైతే ప్రజలు తమను ఛీకొడతారని రాజకీయనాయకులు, అధికారులు చర్చించుకుంటున్నారు.
-  అభినవచారి   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  delhi  gangrape  bbc  interview  mukesh  rajnathsingh  

Other Articles