Nirbhaya documentary british movie maker leslee udwin challenges indian gangrape movies

nirbhaya documentary news, nirbhaya news, British film maker leslee udwin news, nirbhaya documentary controversy, nirbhaya gangrape controversy news, nirbhaya latest news, nirbhaya movies

nirbhaya documentary british movie maker leslee udwin challenges indian gangrape movies : British film maker leslee udwin challenges indian movies that why they didn't ban that movies which are based in nirbhaya gangrape

‘డాక్యుమెంటరీ’ ఓకే.. మరి ‘నిర్భయ’ మూవీల పరిస్థితి ఏంటి?

Posted: 03/05/2015 12:44 PM IST
Nirbhaya documentary british movie maker leslee udwin challenges indian gangrape movies

ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ గ్యాంగ్ రేప్ ఘటన దేశం మొత్తం మీద పెద్ద సంచలనమే రేపిన విషయం తెలిసిందే! ఆ ఘటన నేపథ్యంగా కొందరు దర్శకనిర్మాతలు కొన్ని సినిమాలను తెరకెక్కించారు. ‘తారా’, ‘దామిని.. ది విక్టిమ్’ , ‘ఆజ్ కీ ఫ్రీడమ్’, ‘నిర్భయ’ వంటి పేర్లతో సినిమాలు రూపుదిద్దుకున్నాయి కానీ.. అవి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇవేకాకుండా ఇటీవలే ‘ఇండియాస్ డాటర్’ పేరిట బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ ఓ డాక్యుమెంటరీని తయారుచేశారు. ఇందులో భాగంగానే రేపిస్టు ముకేష్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు.

అయితే.. ఆ ఇంటర్వ్యూలో అతను మహిళలపై కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో అవి పెనువివాదాలకు దారి తీశాయి. ‘మహిళల వల్లే రేప్ లు జరుగుతున్నాయి’ అని అతను పేర్కొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. పార్లమెంటులోనూ అతని ఇంటర్య్వూపై పెద్ద దుమారమే రేగింది. దేశం మొత్తం సంచలనాన్ని సృష్టించిన కేసులో నిందితుడు ఎలా ఇంటర్వూ ఇచ్చాడని వారు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ డాక్యుమెంటరీని అడ్డుకుంటామని ప్రకటన చేశారు. ఆ రేపిస్టు ఇంటర్య్వూ ఇన్ని సంచలనాలు రేగిన నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది.

దీంతో ఈ డాక్యుమెంటరీని నిర్మించిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు నేపథ్యంగా తెరకెక్కుతున్న సినిమాలను ఎందుకు నిషేధించలేదని ఆమె ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. అనుకున్న సమయానికంటే ఈ డాక్యుమెంటరీని ముందు ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేసి తీరుతామన్నట్లుగా బీబీసీ పేర్కొంటోంది. గురువారం (05-03-2015) రాత్రి ప్రసారం చేయనున్నట్లు సమాచారం!

నిర్భయ కథాంశంతో తెరకెక్కిన సినిమాలు :

‘నిర్భయ’ స్నేహితుడు అవీంద్ర ప్రతాప్ పాండే‌‌ను ఇంటర్వ్యూ చేసి ఓ దర్శక నిర్మాత ‘తారా’ అనే మూవీని  తీశాడు. అయితే ఈ చిత్రం తన అభిప్రాయాలను వక్రీకరించిందని, తప్పుదారి పట్టించేదిగా ఉందని పాండే విమర్శించడంతో ఆ సినిమా రిలీజ్ ఆగిపోయింది.

అలాగే జమ్మూలోని ఓ ప్రొడక్షన్ కంపెనీ ‘దామిని’ అనే సినిమా నిర్మించింది. బాలీవుడ్ నటుడు రఘువీర్ యాదవ్ అందులో ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. షాహిద్ కాజ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిర్భయ రోల్‌‌ను సోమన్ అనే యువతి పోషించింది.

2013 అక్టోబరులో ‘ఆజ్ కీ ఫ్రీడం’ అనే మూవీకి డాన్ గౌతమ్ దర్శకత్వం వహించారు. అలాగే బెంగాలీ దర్శకుడు మిలన్ భౌమిక్ ‘నిర్భయ’ టైటిల్‌‌తో సినిమా తీసినా అది కూడా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకపోవడానికి గల కారణాలు తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles