Narayana takes on ap government

narayana takes on AP Government, Anantapur district, cpi rally in anatapur, cpi protesting for special status, cpi national leader narayana, cpi senior leader narayana, narayan lashes out on ap government, narayana on cpi leafers arrest, narayana on ap special status, narayana anantapur rally

narayana takes on AP Government, asks is demanding special status to andhra pradesh is a crime

వాళ్లు బాగానే వున్నారు.. వీళ్లనెందుకు జైళ్లో పెడుతున్నారు..?

Posted: 03/13/2015 09:27 PM IST
Narayana takes on ap government


సీపీఐ రాష్ట్రమాజీ కార్యదర్శి, ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మళ్లీ వార్తల్లో నిలిచారు. రాజకీయాలపై, రాజకీయ నేతలపై తనదైన శైలిలో స్పందించి సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచే నారాయణ టీడీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై స్పందించారు. ఎన్నికలలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతూ హామీలు గుప్పించి వాటిని నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు బాగున్నారు. రాష్ట్రాభివృద్ది కోసం గోంతెత్తి అడిగితే.. వారిపై కేసులు పెట్టి జైళ్లలో పెడతారా అంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అమలు కోరుతూ కేంద్ర కార్యాలయ ముట్టడి సందర్భంగా అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లారు.

అరెస్టులకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటర్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అడిగిన తమ పార్టీ నాయకులను జైల్లో పెడతారా..? రాష్ట్రాభివృద్ధి కోరడం తప్పా..? వారేమన్నా సంఘ విద్రోహ పనులు చేశారా..? అని ఆయన ప్రబుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. కేంద్రం తోక పట్టుకుని నడుస్తున్న టీడీపీ సైతం అడగడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ రాష్టానికి అన్యాయం చేస్తున్న వారు బయట దర్జాగా ఉంటే, అభివృద్ధి జరగాలంటూ ఉద్యమించిన సీపీఐ పార్టీ నేతలను దేశద్రోహం చేసినట్లుగా జైలులో పెట్టారంటూ మండిపడ్డారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఉద్యమం ఆగదని నారాయణ హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cpl agitation  narayana  ananthpuram  

Other Articles