Sachin tendulkar asks maharashtra cm fadnavis to tackle toll menace

Sachin Tendulkar asks Fadnavis to tackle toll menace, Sachin Tendulkar letter to Maharashtra CM Fadnavis, Maharashtra Chief Minister Fadnavis, mumbai toll menace, Sachin Tendulkar, Devendra Fadnavis, toll booths,Toll Collection, Ambulance, Radio Frequency Identification (RFID), traffic jams, Batting legend Sachin Tendulkar, Rajya sabha member sachin tendulkar

Batting legend Sachin Tendulkar has sent a letter to Maharashtra Chief Minister Devendra Fadnavis, urging him to ensure that toll plazas do not cause menace for people.

టోల్ ప్లాజాల సమస్యలపై సచిన్ టెండుల్కర్ లేఖ..

Posted: 03/13/2015 09:30 PM IST
Sachin tendulkar asks maharashtra cm fadnavis to tackle toll menace

అదో పెద్ద సమస్య కానీ చూడటానికి అది చిన్నదిగానే కనబడుతుంది. ప్రభుత్వాలు మారినా.. సాంకేతిక విప్లవంలో దైనందిక మార్పులు వచ్చినా.. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. ముంబై వాసులు నిత్యం ఎదుర్కోంటన్న ట్రాఫిక్ జామ్ లపై గళమెత్తాడు.. ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు భారత రత్న సచిన్ టెండుల్కర్. ట్రాఫిక్ జామ్ లపై గళమెత్తడానికి ఏం వుంటుంది..? అన్న సందేహాలకు తాము లేదు. ఎందుకంటే నగరజీవి ఇది బాగా అలవాటైన సమస్య.

ముంబై నగరంలోని టోల్ గేట్ల వద్ద ప్రజలు నిత్యం ఎదుర్కోంటున్న సమస్యపై సచిన్ టెండుల్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫెడ్నవిస్ కు లేఖ రాశారు. తన లేఖలో  టోల్ గేట్ల వద్ద వాహనదారులు నిత్యం ఎదుర్కోంటున్న సమస్యలను ప్రస్తావించారు. ఈ టోల్ గేట్లు వాహనదారులు పాలిట శాఫంగా పరిణమిస్తున్నాయన్నారు. వాహనదారులకు టోల్ గేట్ల వద్ద ఎదుర్కోంటున్న వ్యయప్రయాలను పరిగణలోకి తీసుకుని  చర్యలు చేపట్టాలని ఆయన తన లేఖలో రాశారు. ముంబైలో నగరంలో మణిహారంలో వున్న టోల్ ప్లాజాల జాబితాను పేర్కోంటూ వాటికి అదనంగా కొత్తగా వస్తున్న ఖర్ఘర్ లో టోల్ ప్లాజా విషయాన్ని కూడా ప్రస్తావించారు.

దీంతో ముంబై నగరవాసులు నిత్యం నరకయాతన పడుతున్నారని, టోల్ ప్లాజా వద్ద ట్రాపిక్ నిత్యం జామ్ అవ్వడంతో వాహనాదారులు శారీరిక శ్రమతో పాటు మానసిక అంధోళనకు కూడా గురవుతున్నారని పేర్కొన్నారు. టోల్ ప్లాజాల విధానాలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందివచ్చిన విప్లవాత్మక సాంకేతిక ఆధారంగా దేశంలో ఎక్కడికి వెళ్లినా.. టోల్ ప్లాజాల వద్ద రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డుల సహకారంతో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఎప్పటికప్పుడు టోల్ ప్లాజాల్లో డబ్బలను తీసుకుంటున్నా.. రోడ్డ పరిస్థితి అద్వానంగా వుందని ఆయన వాపోయారు. ట్రాఫిక్ సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు ఫ్రీ లేన్ ఖాళీగా ఒక లేన్ ను వదిలాలని సూచించారు. ప్రజల ఆగ్రహం చవిచూడకముందే ప్రభుత్వ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ లేఖను ఫిబ్రవరి 20వ తేదీనే సచిన్ రాయగా, మహారాష్ట్ర సర్కారు మాత్రం ఇవాళ మీడియాకు విడుదల చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Devendra Fadnavis  toll booths  traffic jams  

Other Articles