TRS | Established | 14Years | Hyderabad

Trs party celebrating its 14th anniversary in hyderabad

TRS, meeting, foundation, hyderbad, plenary, kcr, jayashankar

TRS Party celebrating its 14th anniversary in hyderabad. TRS party established on 2001, april27. party conducting meeting in hyderabad.

టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి గియాల్టికి 14 ఏండ్లు

Posted: 04/27/2015 12:10 PM IST
Trs party celebrating its 14th anniversary in hyderabad

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  సాధన కోసం ఎంతో మంది పోరాటంలో ముందుకు వచ్చిండ్రు.. కానీ అందులో చేతి వేళ్ల మీద లెక్కించెటంత మంది మాత్రమే ఉద్యమాన్ని కీలకంగా నడిపిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన ఓ పార్టీ మాత్రం చివరకు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాధించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించిండ్రు. ప్రొఫెసర్ జయశంకర్ సలహాతో కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి నడుంబిగించిండ్రు. అట్ల 2001 లో ప్రారంభమైన టిఆర్ఎస్ ప్రస్థానం ప్రజా ప్రస్థానానికి 14  ఏండ్లు పూర్తైనై,, గా సందర్భంగా హైదరాబాద్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశిండ్రు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. తెలంగాణ జీవిత చిత్రానికి తుది రూపునిచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రస్థానంపై తెలుగు విశేష్ ప్రత్యేక కథనం..

టిఆర్‌ఎస్ ఏర్పాటు గాకముందే తెలంగాణ జనసభ వంటి షానా సంస్థలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినై. పెద్ద పెద్ద మేధావుల సుద్దులకే ఉద్యమం పరిమితం అయిన కాలం అది. జనంలో కోరిక ఉంది. సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం లేదు. గదే సమయంలోనే కెసిఆర్ నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. అసలే కరువుతో విలవిలలాడుతున్న కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన కాలంలో బాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసి కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆలోచనలకు, పార్టీ ఆవిర్భావానికి మధ్య దాదాపు రెండేండ్ల వయసు ఉంది. ఈ రెండేడ్ల కాలంలో ప్రధానంగా కెసిఆర్ తెలంగాణ అవసరం ఎందుకు? 1969లో తెలంగాణ ఉద్యమం ఎందుకు విఫలం అయిందో తెలుసుకున్నరు. ఇందుకోసం కేసిఆర్ వివిధ ఉద్యమాలను అధ్యయనం చేసిండ్రు. ఏ దిశగా ఉద్యమాన్ని నిర్వహించాల్నో కేసిఆర్ ఆలోచించిండ్రు.

అట్ల కేసిఆర్ పార్టీని పెట్టినంక తెలంగాణ ఉద్యమంలో కొత్త కొత్త మార్పులు వచ్చినై. అప్పటిదాంకా తెలంగాణ ఉద్యమం బుక్కులుట్ల ఉన్నట్లనే సాన మందికి తెలుసు. కానీ టిఆర్ఎస్ పార్టీ పుట్టినంక ప్రజల్లోకి ఉద్యమం పొయ్యింది. అంతకంతకు పార్టీ చేస్తున్న పనులు జానలల్ల తెలంగాణ ఉద్యమంను బలంగా చేశినై. కేసిఆర్ ఉద్యోగులతో కలిసి జెఎసిగా ఏర్పాడి.. ఉద్యమంని అసలైన స్థాయికి తీసుకపోయిండ్రు. అప్పటిదాంకా తెలంగాణ ఉద్యమం మీద సోయి లేనోళ్లు కూడా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించనింకె చేసిండ్రు కేసిఆర్. జెఎసిగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రజల్లకు తీసుకొని పోయిండ్రు. సకల జనుల సమ్మెతో మొత్తం దేశం క్యాలీ తెలంగాణ మీనికి తిరిగేటట్టు చేసిండ్రు.

సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోయెట్లాగ చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. అప్పటి దాకా జనాలకు కొంచెం దూరంగా ఉంది అనుకున్న తెలంగాణ ఉద్యమం మందిలక్ పోయింది. గప్పటి నుండి తెలంగాణ ఉద్యమం కొత్త ఊపు అందుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఇంగింత బలోపేతం చేస్తూ ఉస్మానియా పోరగాళ్లు, పోరీలు చేశిన ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని కొత్త రాష్ట్రం దిశగా ముందుకు తీసుకొనిపోయిండ్రు. అందుట్లా తెలంగాణ ఉద్యమం ఇంకా ఊపుఅందుకులని కేసిఆర్ ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిండ్రు. తెలంగాణ ఉద్యమం కేసిఆర్ నిరాహార దీక్షతోఒక్కసారి అగ్గిపర్వతంలాగా పేలింది. యాడున్న తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం రోడ్డెక్కిండ్రు. గంతే తెలంగాణల పరిస్థితులు మారినై. దాంతోని పైనున్న కాంగ్రెసోళ్లకు చెమటలు పట్టనై. దాంతోన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

తరువాత తరువాత పరిస్థితులు మారినై.. దాంతో తెలంగాణ ఏర్పాటు చెయ్యనింకె వీలులేదని ఆంధ్రా, రాయలసీమల్ల ప్రజలు రోడ్లెక్కిండ్రు. అట్ల ఎన్ని లొల్లిలు చేశినా.. ఆఖరుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎన్నికలల తెలంగాణ రాష్ట్రం ఏర్పడెటట్ట చేశిన కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే పట్టం కట్టిండ్రు. 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని విజయవంతంగా తీసుకపోయిన టిఆర్‌ఎస్ ఇప్పుడు కొత్త రూపంలో ప్రజల్లోకి పోతుండది. గియాల్టికి టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 14 యేండ్లు అయింది. గందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ హైద్రాబాద్ ల భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.బహిరంగ సభకు ఏకంగా నాలుగు నుండి ఆరు లక్షల మందిని తీసుకొని రావాలనని టిఆర్ఎస్ నాయకులు సూస్తుండరు. తెలంగాణ ప్రజల కల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడంతోనీ టిఆర్ఎస్ పుట్టుక ధన్యమైంది.

జై తెలంగాణ.. జైజై తెలంగాణ

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  meeting  foundation  hyderbad  plenary  kcr  jayashankar  

Other Articles