ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మామూలు జనాలు నానా కష్టాలు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం అందినకాడికి దండుకుంటూ ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల చర్చలు జరపలేదు. కార్మికులు మాత్రం తాము డిమాండ్ చేస్తున్నట్లు ఫిట్ మెంట్ ఇస్తూ ప్రకటన చేస్తే గానీ సమ్మె విరమించేది లేదని ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతూనే.. ప్రైవేట్ వ్యక్తులతో బస్సు సర్వీసులను నడిపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాత్కాలిక నియామకాలతోపాటు ప్రభుత్వ విభాగాల్లోని డ్రైవర్లను ఆర్టీసీ బస్సులకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో రెండు రాష్ట్రాల్లోని పలు డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిపోల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. తాత్కాలిక ఉద్యోగులను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
కార్మికుల సమ్మె నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. ఒప్పంద ఉద్యోగులు విధులకు వచ్చిందే తడవుగా వారి సేవలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరు వేల మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. గురువారం వరకు నామమాత్రపు సంఖ్యలోనే విధులకు హాజరు అయ్యేందుకు వీరు ఆసక్తి చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రోజువారీ వేతనంతో ఆర్టీసీలో సేవలందించేందు వచ్చే తాత్కాలిక ఉద్యోగులకు భవిష్యత్తులో సంస్థ చేపట్టే నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వీరికి 30 శాతం వరకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. విధులు నిర్వహించిన వారికి ధ్రువపత్రాన్ని ఇస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరో పక్క ఆర్టీసీ సమ్మెతో రైళ్లలో రద్దీ పెరిగింది. సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో జనాలు ఇబ్బందులు పడుతూనే ప్రయాణాలు సాగిస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more