Eamcet | Students | Parents | Problems

On ap eamcet eaxm students and parents facing many problem by rtc strike

Eamcet, Students, Parents, Problems, Telangana, Htyderabad

On ap eamcet eaxm students and parents facing many problem by rtc strike. Telangana Students have only hyderabad centers so they are getting more troubles to reach eaxm centers ontime.

విద్యార్థులకు సమ్మె పరీక్ష.. ఇబ్బందుల మధ్యే ఎంసెట్

Posted: 05/08/2015 09:43 AM IST
On ap eamcet eaxm students and parents facing many problem by rtc strike

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతుండటంతో పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎంసెట్ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌లో 22 రీజినల్‌ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజినల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ విభాగానికి ఏపీలో 312, తెలంగాణలో 16 పరీక్షా కేంద్రాలు.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి ఏపీలో 141, తెలంగాణలో 22 కేంద్రాలు కేటాయించారు. తెలంగాణలో 22,758 మంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరు అవుతున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న ఆర్టీసీ సమ్మెతో ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరకం చూస్తున్నారు. అసలే ఎంసెట్ పరీక్షకు నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించడం కుదరదు అని ఎంసెట్ కన్వీనర్ గతంలో ప్రకటించేశారు. దాంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంసెట్ పరీక్ష వారికి పరీక్షగా మారింది. తమ పిల్లల పరీక్ష కోసం పాపం వారు కష్టపడి ఎగ్సామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. ఏపి ఎంసెట్ కు సంబందించి తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ ఒక్కటే సెంటర్ కేటాయించారు.  దాంతో తెలంగాణ జిల్లాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా బస్సులు తిరగకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఎల్బీనగర్, హయత్ నగర్ శివారు ప్రాంతంలో పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నారాయణగూడ, బర్కత్పుర తదితర సెంటర్లకు ఉదయం 7 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ఎంసెట్ పరీక్ష కు కాస్త లేటైనా అనుమతిస్తామంటూ కన్వీనర్ ప్రకటించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eamcet  Students  Parents  Problems  Telangana  Htyderabad  

Other Articles