RTC | Strike | Fitment | High court

Rtc employees gather to discuss about the strike

RTC, Strike, Fitment, High court, Ap, Telangana

RTC employees gather to discuss about the strike. Telangana and ap govts not ready to give 43 percent fitment. High court order to dismiss the strike in this moring.

ఏమి సేతుర సామీ.. ఏమీ సేతు అంటున్న ఆర్టీసీ కార్మికులు

Posted: 05/13/2015 10:31 AM IST
Rtc employees gather to discuss about the strike

ఓ వైపు చూస్తే ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మె విరమించాలని ఆదేశాలు, మరోవైపు ప్రభుత్వాల నుండి సానుకూలంగా రాని ప్రకటనలు. పాపం తానొకటి తలిస్తే దైదవమొకటి తలిచిందన్న చందంగా ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులు తమకు 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అయితే కార్మికులు అడిగిన  ఫిట్ మెంట్ ఇవ్వడానికి రెండు తెలుగు రాష్ట్రాలు సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. కాగా ఏపి ప్రభుత్వం మాత్రం అస్సలు సిద్దంగా లేదు. అసలు కార్మికులకు 27 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. దాంతో ఏం చెయ్యాలో ఆర్టీసీ కార్మికులకు పాలుపోవడం లేదు.

మరోపక్క తెలంగాణ సర్కార్ మాత్రం కాస్త సానుకూలంగానే స్పందిస్తోంది. తెలంగాన ప్రభుత్వం జరిపిన చర్చల్లో దాదాపు 40 శాతం వరకు ఫిట్ మెంట్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ప్రభుత్వాలు సానుకూలంగానో, లేదా వ్యతిరేకంగానో స్పందించే టైంలోనే ఉమ్మడి హైకోర్ట్ ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉదయం లోపు సమ్మె నుండి విరమించాలని ఆదేశించింది. దాంతో ఆర్టీసీ కార్మికుల యూనియన్లు సమావేశమయ్యాయి. ఏం చెయ్యాలన్నదానిపై చర్చిస్తున్నారు. మరి ఆర్టీసీ యూనియన్ నాయకులు ఏం డిసైడ్ చేస్తారో.. ఏం చేస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Strike  Fitment  High court  Ap  Telangana  

Other Articles