apsrtc | rtc | ap | fitment

Apsrtc got 43 percent fitment ap govt ready to give demanded fitment apsrtc union leaders call to rejoin the duties right now

apsrtc, rtc, ap, fitment

Apsrtc got 43 percent fitment . ap govt ready to give demanded fitment. apsrtc union leaders call to rejoin the duties right now.

ఏపీలో బస్సులు రైయ్ రైయ్

Posted: 05/13/2015 04:16 PM IST
Apsrtc got 43 percent fitment ap govt ready to give demanded fitment apsrtc union leaders call to rejoin the duties right now

ఏపి ప్రభుత్వం 43శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దాంతో ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా తమకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా 43 శాతం షిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. అయితే నిధుల కొరతతో బాధపడుతున్న ఏపి సర్కార్ అంత భారాన్ని మొయ్యలేమని చేతులెత్తేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపి సర్కార్ ఫిట్ మెంట్ కు ఓకే చెప్పాల్సి వచ్చింది. అయితే మంత్రులు శిద్దా, అచ్చెన్నాయుడు , ఆర్టీసీ ఎండీలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. చర్చల్లో 43 శాతం ఫిట్ మెంట్ కు ఓకే చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఓకే కావడంతో ఆర్టీసీ యూనియన్లు సంతోషం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అధికారికంగా సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి. మరో పక్క వెంటనే విధుల్లోకి చేరాలని కార్మిక సంఘం నాయకులు కార్మికులను కోరారు. తమ డిమాండ్లను తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే పెట్టామని, 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. అందువల్ల కార్మికులందరూ తక్షణం విధులకు హాజరవ్వాలని ఆయన కోరారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apsrtc  rtc  ap  fitment  

Other Articles