bangladesh | RSS | Boarder | Modi

Rss warned on boarders of india specially about bangladesh

bangladesh, RSS, Boarder, Modi, India

RSS warned on boarders of india specially about bangladesh. RSS demand to close the entrance at the bangladesh and said that dont allow bangladeshis to india.

సరిహద్దుపై ఆర్ఎస్ఎస్ మాట.. ఆలొచనలో మోదీ సర్కార్

Posted: 05/18/2015 09:24 AM IST
Rss warned on boarders of india specially about bangladesh

మోదీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ సరిహద్దు బాంబ్ పేల్చింది. సరిహద్దుల విషయంలో భారత్ కఠినంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ సూచించింది. ముందు నుండి మోదీ సర్కార్ ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాత్రం  భారత సరిహద్దులు ప్రస్తావన తీసుకువచ్చింది. బహుశా చైనా, బంగ్లాదేశ్ లు గత కొంత కాలంగా భారత భూభాగాలను తమ భూభాగాలుగా లెక్కిస్తు ఉండటంతో పాటు, బంగ్లా నుండి భారత్ కు విపరీతమైన వలసలు పెరిగాయి. దాంతో ఆర్ఎస్ఎస్ భారత సర్కార్ కు సరిహద్దుల విషయంలో ఏ మాత్రం అలసత్వంగా ఉండవద్దంటూ సలహా ఇచ్చింది.

బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేయాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. ఆ దేశంతో భూ బదలాయింపు ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందిన అనంతరం ఇక అక్రమ వలసలకు ఎంతమాత్రం అవకాశం లేకుండా ఇరు దేశాల మధ్యా సరిహద్దులను మూసివేయాలని ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ సంపాదకీయం పేర్కొంది. బంగ్లాదేశ్ లో భూ బదలాయింపు ఒప్పందాన్ని ఆహ్వానిస్తూనే....ఆ దేశం నుంచి అక్రమ వలసలను నిరోధించకుంటే జమ్మూ కాశ్మీర్ పరిస్థతి ఏర్పడుతుందని హెచ్చరించింది. మరి దీనిపై మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  RSS  Boarder  Modi  India  

Other Articles