alchohol | india | WHO

There is 30 percebt people of india will drink alchohol

alchohol, india, survey, WHO

There is 30 percebt people of india will drink alchohol. WHO latest survey clear the data of alchoholics in india and it effects.

పది మందిలో ముగ్గురు తాగుబోతులే

Posted: 05/18/2015 09:27 AM IST
There is 30 percebt people of india will drink alchohol

భారత్‌లో 30 శాతం మంది ఆల్కహాల్‌ సేవిస్తారని, వారిలో 4-13 శాతం మంది నిత్యం తాగుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ ఓ) నివేదిక తేల్చినట్టు సేక్సారియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పిసి గుప్తా వివరించారు. మద్యపానం వల్ల అనేక రుగ్మతలు సంభవిస్తున్నందున వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు, కనీసం తగ్గించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. కాలేయం, కిడ్నీ, గుండె, క్లోమగ్రంథి, మెదడు తదితర అవయవాలకు మద్యం తీరని నష్టం కలిగిస్తోందని, క్యాన్సర్‌ వ్యాధిని కూడా తీవ్రం చేస్తోందని వారు చెబుతున్నారు. ఆల్కహాల్‌ కారణంగా గొంతు, రొమ్ము, లివర్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోందని డాక్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగుడుకు బానిసైన వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్నాయని సర్వేలో తేలింది. ఆర్థిక, ఆరోగ్య సమస్యలతోపాటు వారి పని ప్రదేశాల్లో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోయింది. తాగుబోతుల వల్ల గొడవలు, కొట్లాటలతో ఇతరులకు, కుటుంబ సభ్యులకూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉండగా, మద్యపానం ఆయాదేశాల, సమాజాల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే మద్యాల్లో ఉండే ఆల్కహాల్‌ శాతాన్ని బట్టి కూడా అది ఆరోగ్యంపై చూపే ప్రభావం ఆధారపడి ఉంటోంది. ప్రతిరోజు నామమాత్రంగా మద్యం పుచ్చుకోవచ్చునని, తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి పెద్దగా నష్టం చేయదని గతంలో బ్రిటిష్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ సిఫారసు చేసింది. అయితే వాటిని విశ్వసించలేమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా మద్యం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లుతోందనేది నిజం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alchohol  india  survey  WHO  

Other Articles