Amith sha | BJP | AP | Special status | Chandrababu

Bjp party president amith sha assure to give specail status to ap

Amith sha, BJP, AP, Special status, Chandrababu

BJP party President Amith sha assure to give specail status to ap. He hope to special status announcement soon.

నవ్యాంధ్రకు అమిత్ షా అభయం

Posted: 05/26/2015 12:29 PM IST
Bjp party president amith sha assure to give specail status to ap

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నది వాస్తవమేనన్నారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి తో టచ్ లోనే ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు త్వరలో ప్రత్యేక హోదాను ప్రధాని ప్రకటిస్తారని అమిత్ షా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పాలనా పటిమతో ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని పెంచారని అమిత్ షా మోదీ ఏడాది పాలన గురించి అన్నారు. ఎన్డీఏ సర్కార్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని వివరించారు. యూపీఏ పాలనలో పదేళ్లపాటు దేశ ప్రజలు అవినీతితో విసిగిపోయారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉందని, పార్టీలకు అతీతంగా ప్రధాని అన్నిరాష్ట్రాల అభ్యున్నతి కృషి చేస్తున్నారనని అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో వరదలు వచ్చినా, నేపాల్‌లో భూకంపం వచ్చినా వెంటనే ప్రభుత్వం స్పందించి, ఆదుకున్నదని తెలిపారు.

ఏడాదిలో ఎన్డేయే ప్రభుత్వంపై ఒక్క అవినీతి కేసుకూడా లేదు. ఎవరూ ఆరోపణలు కూడా చేయలేదని అమిత్ షా సగర్వంగా చెప్పారు. నరేంద్రమోదీ దార్శికుడు.. మాది ముందుచూపున్న ప్రభుత్వం. ప్రజా విశాసాన్ని చూరగొనడం మా ప్రధాన విజయం అన్నారాయన. మోదీ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రపంచం గుర్తిస్తోందని వివరించారు. వేగంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయని, జీడీపీ లో వృద్ధి సాధించామని అమిత్ షా వివరించారు. ఆర్థికంగా ప్రభుత్వం పటిష్టమైన స్థితి చేరిందన్నారు. మొత్తానికి అమిత్ షా అభయం నిజంగా నవ్యాంధ్రకు వరంగా మారుతుంది. అయితే అమిత్ షా నోటి వెంట వచ్చిన ఇవే పలుకులు ప్రధాని మోదీ నోటి నుండి వచ్చి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేదేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amith sha  BJP  AP  Special status  Chandrababu  

Other Articles