TRAI former chairman Pradip Baijal allegations on ex pm manmohan singh | 2g scandal case controversy

Pradip baijal allegations ex pm manmohan singh 2g scandal case controversy

Pradip Baijal news, 2g scam, 2g scam controversy, manmohan singh, 2g scam scandal, manmohan singh controversies, dayanidhi maran

Pradip Baijal allegations ex pm manmohan singh 2g scandal case controversy : TRAI former chairman Pradip Baijal allegations on ex pm manmohan singh. He told in his book that manmohan singh given warning him to support in 2g scam.

‘మౌన్’మోహన్ బెదిరించారా..?

Posted: 05/26/2015 12:54 PM IST
Pradip baijal allegations ex pm manmohan singh 2g scandal case controversy

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే! ఎప్పుడూ మౌనంగా వుంటూ తనపని తాను చేసుకునే ఈయనపై ఈ విధంగా ఇంత పెద్ద స్కాండల్ లో హస్తమున్నట్లుగా వార్తలు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు.. ఇతరులకు ఏ హాని తలపెట్టని ఈ సున్నిత మనస్కుడిపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. 2జీ వ్యవహారంలో సహకరించకుంటే ‘హాని’ తప్పదని ప్రధానిగా వున్నప్పుడు మన్మోహన్ సింగ్ హెచ్చరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ తాజాగా ఆరోపించడం సంచలనంగా మారింది.

2జీ స్కామ్ లో విచారణ ఎదుర్కొంటున్న బైజాల్ ‘ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫామ్స్: 2జీ, పవర్ అండ్ ప్రైవేట్ ఎంటర్ ప్రైజ్- ఏ ప్రాక్టీషనర్స్ డైరీ’ పేరుతో ఓ పుస్తకం రాశారు. అందులో ఆయన 2జీ స్కాం వ్యవహారాల గురించి పలు విషయాలు వెల్లడించారు. తనలాంటి అధికారులు విచారణ ఎదుర్కోవడానికి ప్రధాన కారకుడు ‘మన్మోహన్ సింగ్’ అని ఆరోపించారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని తాను వ్యతిరేకించానని, అయితే తన ఆందోళనను మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదని బైజాల్ తెలిపారు. టెలికాం విభాగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని, టెలికాం మంత్రి తీసుకుంటారని... వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మారన్ తనను బెదిరించారని వెల్లడించారు. మారన్ అన్నట్టుగానే చేశారని, తర్వాత తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. 2009-10లో 2జీ స్కామ్ వెలుగులోకి వచ్చాక ట్రాయ్ లోని కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం తొలగించిందని బైజాల్ తన పుస్తకంలో ఆరోపించారు.

ఇప్పటికే 2జీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ ప్రతిష్టను ఈ ఆరోపణలు మరింత దెబ్బతీశాయని చెప్పుకుంటున్నారు. మరీ.. ఈ వ్యాఖ్యలపై మన్మోహన్ స్పందిస్తారా..? లేక తన మౌనవ్రతాన్నే పాటిస్తూ అలాగే చూస్తుండిపోతారా..? ఈ వ్యవహారంపై మరెన్ని వార్తలు రానున్నాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pradip baijal  manmohan singh  2g scam  

Other Articles