సోషల్ మీడియా మనుషులను దగ్గర చెయ్యడం అందరికి ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఆనందం వెనుక మరోకోణం కూడా దాగి ఉంది. ఇదే సోషల్ మీడియాను వాడుకొని కొంత మంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ హైదరాబాదీ అమ్మాయి మోసపోయాను బాబోయ్ అంటూ లబోదిబో మొత్తుకుంటోంది. ఏకంగా పద్దెనిమిది లక్షల రూపాయలు మోసపోయాను అంటూ పోలీసులు కంప్లైంట్ చేసింది అమ్మాయి. అయితే మ్యాటర్ ఏంటీ అంటే.. హైదరాబాద్ లో ఉంటున్న అమ్మాయికి షేస్ బుక్ లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తనను తాను జియాలజిస్టుగా పరిచయం చేసుకున్న అతను ఆమెతో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. చాటింగ్ కాస్తా ప్రేమగా మారింది. చాటింగ్ లో ఏకంగా పెళ్లి ప్రపోజల్ కూడా చేశాడు. దాంతో ప్లాట్ అయిన అమ్మాయి మొత్తం నిజమే అని నమ్మేసింది.
అయితే అలా చెప్పిన తర్వాత ఫారెన్ నుండి తనకు జువెలరీ, ఫారెన్ కరెన్సీ పంపుతున్నానని చెప్పాడు. తొందరలోనే కస్టమ్స్ డిపార్ట్ మెంట్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది అని చెప్పాడు. అతను అన్నట్లే కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ కూడా వచ్చింది. అయితే పారెన్ నుండి పార్సిల్ వచ్చింది కాబట్టి ఫార్మాల్టీస్ ఉంటాయి. అందుకు గాను రకరకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంటూ ఏకంగా పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే తీరా ఆ కొరియర్ చేతికి రాకపోవడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీసింది ఆ అమ్మాయి. అప్పుడు తెలిసింది అసలు నిజం. ప్రేమ పేరుతో మోసపోయానని పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే ఇలా చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమ, పెళ్లి పేరుతో మాయ చేసి డబ్బులు కొట్టేస్తున్నారని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఘరానా మోసానికి ఫేస్ బుక్ మాంచి వేదికగా మారింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more