Modi | Sonia Gandhi | Bihar | Nitesh Kumar

Sonia gandhi slams narendra modi for his govt

Modi, Sonia Gandhi, Bihar , Nitesh Kumar, Lalu prasad yadav, Ravishankar Prasad, NDA Govt

Sonia Gandhi slams Narendra Modi for his govt. Sonia Gandhi said that modi didnt do any thing, but he did hige publicity. Nitesh Kumar and lalu prasad yadav also slams modi.

మోదీ పొడిచిందేమీ లేదు... బీహార్ లో హాట్ పాలిటిక్స్

Posted: 08/31/2015 08:20 AM IST
Sonia gandhi slams narendra modi for his govt

బీహార్ లో రాజకీయంగా రసవత్తరంగా మారింది. మోదీ మీద అన్ని పక్షాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ లకు తోడుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. పాట్నా ర్యాలీలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. బీహార్ కోసం మోడీ చేసిందేమీ లేదన్నారు.కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. దేశంతోపాటు బీహార్‌లోనూ మోడీ పట్ల విశ్వాసం రోజురోజుకూ సన్నగిల్లుతోందన్నారు. ధరలు పెరిగాయనీ, రూపాయి విలువ పడిపోయిందనీ, ఉగ్రవాద దాడులు పెరిగాయనీ మండిపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి. ఇప్పటి దాకా మోదీ చేసిందేమీ లేదని కేవలం ప్రచారం మాత్రం భారీగా చేసుకున్నారని మండిపడ్డారు సోనియా గాంధీ. నితీశ్ పాలనలో బీహార్ ముందుకెళ్తోంది.ఇందుకు లాలూప్రసాద్ కూడా సహాయ పడుతున్నారు.బీహార్ ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.ఎవరి దయాదాక్షిణాలపై ఆధార పడాల్సిన అవసరం లేదన్నారు సోనియా.

ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ షోగా మారిన లక్నో బహిరంగసభలో సోనియా ‘ఎక్స్- ట్రా’పాత్ర పోషించారని బీజేపీ అధికారప్రతినిధి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడం తప్ప, వీరు సభ పెట్టి సాధించింది ఏమీలేదని ఆయన విమర్శించారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ సభలో ‘ స్వాభిమానం’ లేకుండా పోయిందన్నారు. లాలూ బలప్రదర్శనషోలో.. నితిశ్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా చూపారని, సోనియా ఎక్స్ ట్రా ఆకర్షణగా నిలిచారని, ఏర్పాట్లన్నీ నితిశ్ కుమార్ చేసినట్లు చూపారని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక కీలక పాత్ర పోషించిన మేడం .. మరుగుజ్జువంటి లాలూతో కలిసి అధికారం పంచుకునేందుకు సిద్ధమయ్యారని, ఈ సభద్వారా లాలూ స్కామ్ లకు తన ఆమోదముద్ర తెలిపినట్లయిందని కేంద్రమంత్రి ఎదురుదాడి చేశారు. చంద్రగుప్త మౌర్యుడితో లాలూ పోల్చుకోవడం.. హాస్యాస్పదమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Sonia Gandhi  Bihar  Nitesh Kumar  Lalu prasad yadav  Ravishankar Prasad  NDA Govt  

Other Articles