MP Kavitha | Telugu states | AP | Telangana

Trs mp kavitha call to fight aganist the modi for telugu states benefits

Kavitha, MP Kavitha, Telugu states, AP, Telangana, Special Status, Modi, Capital

TRS MP Kavitha call to fight aganist the Modi for telugu states benefits. She express her condolence for who died to get special status. She oppose the chandrababu Naidu Behaviour.

తెలుగు రాష్ట్రాలుగా కలిసి కొట్లాడదాం: ఎంపీ కవిత

Posted: 08/31/2015 08:24 AM IST
Trs mp kavitha call to fight aganist the modi for telugu states benefits

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆత్మహత్యల్ని చూస్తే బాధగా ఉందని టిఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు.  తెలుగువారిగా... తెలుగు రాష్ట్రాల హక్కుల సాధన కోసం కేంద్రంతో కలిసి కొట్లాడదామని... అంతే తప్ప ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారామె. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. అప్పటి తెలంగాణ తల్లుల కడుపుకోత తనకు తెలుసు కాబట్టే.. ఏపీలో ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కవిత కోరారు. ‘ఒక సోదరిగా ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’నని తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు నిలదీయాలని కవిత సూచించారు.

బీహార్‌లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్యాకేజీ ప్రకటించారని, కానీ.. ఏడాదిగా పెండిగ్‌లో ఉన్న ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు, అభివృద్ధి కోసం తెలంగాణకు ఇస్తామన్నవి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేర్చలేదన్నారు. వీటన్నింటిని చంద్రబాబు ఎత్తి చూపాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆయన మౌనం ఏపీకి శాపంగా మారుతోందన్నారు. రాజధానికి నిధులిస్తామని, తెలంగాణ అభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చిన మోడీ... ఏడాది గడిచిపోయినా హామీల్ని నెరవేర్చలేదని... దీనిపై కలిసికట్టుగా పోరాడదామని ఆమె చంద్రబాబుకు సూచించారు. నీటి కోసం కూడా పొరుగు రాష్ట్రాలతో కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  MP Kavitha  Telugu states  AP  Telangana  Special Status  Modi  Capital  

Other Articles