AP cm Chandrababu Naidu said that he also belongs to Raayalasema

Ap cm chandrababu naidu said that he also belongs to raayalasemachandrababu naidu slam the leader who protesting for raayalasema he said that he is also belongings to raayalasema

AP, Chandrababu Naidu, Raayalaseema, Nara Chandrababu naidu, Seema, Raayalasema Protest

Chandrababu Naidu slam the leader who protesting for Raayalasema. He said that he is also belongings to Raayalasema.

నేను రాయలసీమ వాడినే అంటున్న చంద్రబాబు

Posted: 11/09/2015 03:30 PM IST
Ap cm chandrababu naidu said that he also belongs to raayalasemachandrababu naidu slam the leader who protesting for raayalasema he said that he is also belongings to raayalasema

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద మాట్లాడుతున్న నాయకుల మీద మండిపడ్డారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాయలసీమకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. తాను కూడా రాయలసీమ వాడినే అంటూ గుర్తు చేశారు. ఏపి ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్న వారి మీద మండిపడ్డారు. అసలు పనిపాటలేని నాయకులే అలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రాయలసీమకు అన్ని రకాల అభివృద్ది కార్యక్రమాలకు సహాయపడుతోందని అన్నారు. కేవలం రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నాయకులు మాత్రమే కారణమని చంద్రబాబు అన్నారు.

కొంత మంది నాయకులు కావాలనే రాయలసీమకు అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు. అలాంటి వారు అవాకులు చవాకులు పేలుతున్నారని... అవి మానుకోవాలని సూచించారు. రాయలసీమ అభివృద్దికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉందని అన్నారు. కాగా తాజాగా మైసూరా రెడ్డి రాయలసీమ కోసం ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బైరెడ్డి లాంటి వాళ్లు రాయలసీమ గురించి ప్రత్యేకంగా పోరాటాలు కూడా చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu Naidu  Raayalaseema  Nara Chandrababu naidu  Seema  Raayalasema Protest  

Other Articles