YS Jagan crow noise in kakinada

Ys jagan crow noise in kakinada

YS Jagan, YSRCP, YSRCP, Kakinada, Special Status, AP, Guntur, Kakinada

YSRCP President YS Jagan will protest in Kakinada soon. He is demanding special status for ap. Already he did protest in Guntur before the Amaravati inaguration.

ఇక కాకినాడలో జగన్ కాకి గోల

Posted: 11/09/2015 03:32 PM IST
Ys jagan crow noise in kakinada

వైయస్ జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు గర్జన తర్వాత జగన్ చాలా కాలం పాటు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు. ఏపికి ప్రత్యేక హోదా అనేది ప్రాణవాయువులాంటిదని చెబుతూ.. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా గతంలో గుంటూరు జిల్లాలో బారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు జగన్ ఇలా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినా కనీసం.. మీడియాలో కూడా సరిగా కవరేజ్ లేకపోవడం వైసీపీ నాయకులకు కూడా నిరాశను మిగిల్చింది.

గుంటూరు తర్వాత తాజాగా మరోసారి కాకినాడలో యువభేరి నిర్వహించనున్నట్లు వైసీపీ పార్టీ నాయకులు ప్రకటించారు. మొన్న గుంటూరు జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికే సరిగా కవరేజ్ లేదని.. కష్టపడి జనాలను పోగేసినా కూడా గుర్తింపు రాలేదని వైసీపీ నాయకులు బాధపడ్డట్లు తెలుస్తోంది. మరి కాకినాడ సభలో వైయస్ జగన్ ఏం చెప్పాలనుకున్నారో.. దానికి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏపికి ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం దొంగాటలాడుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ప్రకటిస్తామని చెప్పిన బిజెపి.. ఇప్పుడు మాత్రం తాత్సారం చేస్తోంది. దీన్ని నిరసిస్తు జగన్ కాకినాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  YSRCP  Kakinada  Special Status  AP  Guntur  Kakinada  

Other Articles