అదేంటి.. ఎంతోమంది అమ్మాయిలు వుండగా సెక్స్ డాల్ తో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనే సందేహాలు ఈ టైటిల్ చూడగానే ప్రతిఒక్కరికి రాక తప్పదు. నిజానికి ఆ అబ్బాయి కూడా ఓ అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని సుఖంగా జీవితం కొనసాగించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. తనకు ప్రాణాంతక వ్యాధి వున్నట్లు తెలిసింది. ఎంతోకాలం బతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దాంతో పెళ్ళి చేసుకున్నాకే తనువు చాలించాలని భావించిన ఆ యువకుడు.. సెక్స్ డాల్ తో వివాహం చేసుకున్నాడు.
చైనాకు చెందిన 28 ఏళ్ల అందమైన యువకుడు చూడానికి ఎంతో హ్యాండ్ సమ్ గా వుంటాడు. అతని వెంటపడే అమ్మాయిల జాబితా కూడా చాలా ఎక్కువే. తానూ అందరిలాగే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవన విధానాన్ని కొనసాగిద్దామని అనుకున్నాడు. కానీ.. ఇంతలోనే అతనికి టెర్మినల్ క్యాన్సర్ (ప్రాణాంతక క్యాన్సర్) ఉన్నట్టు బయటపడింది. ఎక్కువకాలం బతకలేడని డాక్టర్లు కూడా తేల్చి చెప్పేశారు. దాంతో పెళ్లి చేసుకున్నాకే తనువు చాలించాలనుకున్నాడు ఆ యువకుడు. తనని పెళ్లి చేసుకోవడానికి దయతలచి మానవత్వంతో ఎవరు ముందుకొచ్చినా.. వారి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుందని ఆ చైనా యువకుడు భావించాడు. చివరకు సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకోవాలని తీర్మానించాడు. బంధు, మిత్రుల సహకారంతో ముహూర్తం పెట్టుకున్నాడు. ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న బొమ్మను పెళ్లి కూతురును చేశారు.
బంధు, మిత్రులు మేకప్ ఆర్టిస్ట్‌ను, ముత్తయిదువులను పిలిపించి పెళ్లి కూతురును ముస్తాబు చేశారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి ఘనంగా జరిపించారు. అనంతరం పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకు ఫొటోలను ప్రత్యేకంగా తీశారు. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న సెక్స్ డాల్ ముందు మొకాళ్లపై వంగి సున్నితమైన ఆమె మునివేళ్లను చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా పెళ్లి కొడుకు ముద్దాడుతున్న దృశ్యాలను కెమెరాలతో చిత్రీకరించారు. అనంతరం వారిని ఏకాంతంగా వదిలేసి బంధు, మిత్రులు వెళ్లి పోయారు. ఇప్పుడు ఈ పెళ్లి ఫొటోలు చైనా సోషల్ వెబ్సైట్లో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా ఈ ఫొటోలను ప్రచురించిన చైనా వెబ్సైట్ పెళ్లి కొడుకు వివరాలను మాత్రం వెల్లడించలేదు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more