కాల్ మనీ అంటే ఎదో చిన్నా చితక వ్యాపారస్థులు జరిపిన తంతు అనుకుని విచారణ చేపట్టిన పోలీసులకు తొవ్విన కొద్ది కొత్త విషయాలు తెలియడంతో విస్మయానికి గురవుతున్నారు. వడ్డీలు కట్టలేని బాధితుల ఆస్తులను తమ పేరున రాయించుకోవడంతో పాటు వారిని వ్యభిచారం వృత్తిలోకి బలవంతంగా పంపి ఆ సోమ్మును కూడా వారు స్వాధీనం చేసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసును తొవ్వుతున్న పోలీసులకు అధికంగా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుతలో పాటు పలువురు అగ్రనాయకులకు కూడా సంబంధాధాలున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి. పలువరు ఎమ్మెల్యేలతో పాటు, ఎన్ ఆర్ ఐ లు, ప్రముఖులు, ఒకరిద్దరు మంత్రులకు కూడా సంబంధాలున్నాయిన్న అరోపణలు గుప్పుమంటున్నాయి.
కాగా ఈ మొత్తం వ్యవహరంపై జాతీయ మానవహక్కుల కమీషన్ తీవ్రంగా పరిగణించి.. రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడులకు నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, గుత్తిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... దాదాపు రూ. 4 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లతోపాటు 20 ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు సోదాలు చేశారు. కె.వెంకటేశ్వరరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి 59 ప్రామిసరీ నోట్లు, ఆరు ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. సోదాల నేపథ్యంలో పలువురు వ్యాపారులు పరారీలో ఉన్నారు. అటు విజయనగరం: జిల్లా లోని పలు ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి... 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని వినుకొండ పోలీసులు వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలపై దృష్టి సారించారు. స్థానికంగా 30 మంది వ్యాపారులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఆభరణాలు, నగదు వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
చిత్తూరు పట్టణానికి చెందిన నలుగురు బాధితులు పట్టణ డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు కాలమనీ గురించి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వడ్డీ వ్యాపారులంతా ప్రభుత్వ ఉద్యోగులేననే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వడ్డీ వ్యాపారంలో ఆర్టీసీ, మున్సిపాలిటీ, ట్రాన్స్‌కో, ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more