చంద్రబాబు నాయుడు.. దేశంలో చతురత కలిగిన నాయకుడు.. దేశ రాజకీయాల్లో చాణిక్యుడు ఇలా ఎంతో మంది చెబుతుంటారు. కానీ అలాంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులు కనిపించకుండా.. మీడియా మేనేజ్ మెంట్ బాగా చేస్తారని బాగా పరిశీలించే వారికి మాత్రమే అర్థమవుతుంది. తాజాగా కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కనీసం ఒక్కసారి కూడా నోరుమెదపలేదు. తన మీద, తన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మీడియా ముఖంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు... కానీ ఎందుకు ఇలా జరగుతోంది. చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే అది మాత్రం జవాబు లేని ప్రశ్నే.
Also Read: కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..?
Also Read: చంద్రబాబుకు బ్యాడ్ టైం.. కారణం అదే
అయితే చంద్రబాబు నాయుడు మీద విమర్శల వర్షం కురుస్తోంది. చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు కలిసి కాల్ మనీలో పాలుపంచుకున్నారని కొంత మంది విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాల్ మనీలో చంద్రబాబు నాయుడు డబ్బులు ఉన్నాయని ప్రతిపక్షనేత జగన్ ఆరోపించారు. ప్రస్తుతం ఏపిలో మాఫియా ను ప్రోత్సహించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ వెల్లడించారు.
Also Read: కాల్ మనీ వివాదంపై కదిలిన జనసేన
Also Read: కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..!
కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు.. కాల్ మనీ నిర్వాహకులతో తెలుగుదేశం నాయకులు సంబందాలు కలిగి ఉన్నారని క్లీయర్ గా అర్థమైంది. అయినా కూడా దాన్ని ఖండించరూ.. కనీసం వివరణ కూడా ఇవ్వరు. ఎందుకంటే దాని మీద వివరణ ఇవ్వడానికి.. మాట్లాడటానికి యనమల లాంటి వాళ్లు ముందుంటారు. ఆడవాళ్లకు మా ప్రభుత్వంలో పూర్తి రక్షణ ఉందంటూ ఊదరగొట్టే చంద్రబాబు నాయుడు అదే మహిళలు.. కన్నీరు పెట్టుకుంటూ.. పుట్టెడు దు:ఖంతో తమ గోడు వెల్లగక్కుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మందీమాగదులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. తప్ప. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదని క్లీయర్ గా అర్థమవుతోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more