MP Kerti Azxad sesational comments on Arun jaitly

Mp kerti azxad sesational comments on arun jaitly

Arun Jaitly, DDCA, AAP, Kejriwal, Kerti Azad

MP Kerti Azad sesational comments on Arun jaitly. On behalf of Delhi District Cricket Association alligation, Arun Jaitly facing troubles.

నా మీద పరువు నష్టం దావా వేయండి అరుణ్ జైట్లీ

Posted: 12/22/2015 09:36 AM IST
Mp kerti azxad sesational comments on arun jaitly

ఢిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ) అవినీతి ఆరోపణల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సొంత పార్టీ నేత ఒకరు ఇబ్బందిగా మారారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేసిన విషయంపై బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ కూడా స్పందించారు. ఆయన ఈరోజు ట్విట్టర్లో జైట్లీనుద్దేశించి నాపైన కూడా పరువునష్టం దావా వెయ్యండి.. ట్విట్ చేశారు. డీడీసీఏ అంశంలో తలదూర్చవద్దని భాజపా నేతలు హెచ్చరించినా పట్టించుకోకుండా భాజపా నేత కీర్తి ఆజాద్‌ ఆర్థిక మంత్రి జైట్లీపై విమర్శలకు దిగుతున్నారు. డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ ఓ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు.

'హలో డియర్‌ అరుణ్‌ జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్‌ నా మీద కూడా వెయ్‌. మినహాయింపు ఏమీ వద్దు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్‌ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్‌ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు. జైట్లీపై తన ట్వీట్ల గురించి ప్రస్తావించగా 'కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడే కాళియ సర్పంతో పోరాడాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కృష్ణుడు ఎవరో, కాళియుడు ఎవరో మీరు వ్యాఖ్యానించాలి' అని కీర్తి ఆజాద్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitly  DDCA  AAP  Kejriwal  Kerti Azad  

Other Articles