Odisha officer reveals her transgender identity

Odisha officer reveals her transgender identity

Aishwarya Rutuparna Pradhan., ransgender, Odisha officer, the Odisha Aadministrative Service examination,

More than a year and a half after the Supreme Court ruled that transgenders can be a third gender, a 32-year-old Odisha government officer has come out in the public with her transgender identity. Ratikanta Pradhan, who got into Odisha Financial Service five years ago after clearing the Odisha Aadministrative Service examination, has now decided to become Aishwarya Rutuparna Pradhan.

ఆయన సార్ కాదు.. మేడం

Posted: 12/22/2015 09:41 AM IST
Odisha officer reveals her transgender identity

నిన్నటి దాకా సార్.. సార్ అని అందరూ పిలిచే వారు.. కానీ ఉన్నట్టుండి అందరూ తనను సార్ అని కాకుండా.. మేడమ్ అని పిలవాలని అంటే ఎలా ఉంటుంది. కానీ ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. లింగ మార్పిడి చేయించుకున్న ఆఫీసర్ రతికాంత ప్రధాన్.. తన పేరును ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ గా మార్చుకున్నారు. తన గుర్తింపును స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒడిషా ఫైనాన్స్ సర్వీస్ లో ప్రధాన్ పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల తన గర్తింపు మార్చుకునే వీలయిందని ఐశ్వర్య రుతు పర్ణ ప్రధాన్ పేర్కొన్నారు.

పారదీప్ పోర్ట్ టౌన్ షిప్ లో కమర్షియల్ టాక్స్ అధికారిగా ప్రధాన్ కు పోస్టింగ్ ఇచ్చారు. తన ఐడెంటిటీ చెప్పుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మహిళలు, పురుషులతో లింగ మార్పిడి చేసుకున్నవారికి మూడో కేటగిరి వారికి అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన గుర్తింపు, హక్కులు కల్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన్ గతంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్స్ లో గ్రాడ్యుయేట్, తర్వాత స్టేట్ సివిల్ సర్వీస్ లో చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles