మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే ప్రతి స్టేట్ మెంట్ మీద మహిళలు మండిపడుతున్నారు. తాజాగా శనిసింగాపూర్ లో మహిళల ప్రవేశం కోసం కొంత మంది మహిళా సంఘం నాయకులు నిరసనలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ హోంమంత్రి గారు మహిళల దేవాలయ ప్రవేశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు దేవాలయాలకు వెళ్లాల్సిన పని లేదని బాబూలాల్ గౌర్ సెలవిచ్చారు. ఇంట్లోనే కూర్చుని ప్రార్థనలు చేసుకుంటే చాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గౌర్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
కాగా శనిసింగపూర్ లోని శనిదేవాలయంలోకి మహిళల ప్రవేశం లేదు.. అది చాలా కాలంగా సాగుతున్న ఆచారం. అయితే కొంత మంది మహిళా సంఘాల నాయకులు మాత్రం ఇది మహిళల మీద చూపిస్తున్న వివక్షే అంటూ మండిపడుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ హోంమంత్రి మాత్రం దీని మీద అనవసర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మద్యం సేవించడం మన ప్రాధమిక హక్కని అన్నారు. సమాజంలో అదొక స్టేటస్ సింబల్ గా మారిందని కామెంట్ చేశారు. రేప్‌లు కొన్నిసార్లు రైటని, కొన్నిసార్లు తప్పని వ్యాఖ్యానించి మహిళల ఆగ్రహానికి గురయ్యారు. దక్షిణాదిలో మహిళలు పొందిగ్గా దుస్తులు ధరిస్తారని, అందువల్లే అక్కడ రేప్‌లు తక్కువని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more