ఖైదీని కౌగిలించుకున్న మహిళా జడ్జ్ | Judge Hugs prisoner

Judge hugs prisoner

Judge, Miami, Prisoner, Judge Mindly Glazer, ఖైదీ, జైలు, జడ్జ్

A judge who shot to fame when she recognized an inmate in her courtroom as a former classmate has met the main again, but this time with a hug after he was released from jail.Miami-Dade Judge Mindy Glazer was on hand to greet Arthur Booth Tuesday as he was released from jail after serving 10 months.

ఖైదీని కౌగిలించుకున్న మహిళా జడ్జ్

Posted: 04/21/2016 12:48 PM IST
Judge hugs prisoner

ఖైదీకి, జడ్జ్ కు ఉన్న రిలేషన్ ఏంటీ అంటే అందరికి తెలుసు. ఖైదీలు తప్పు చేస్తే వారికి శిక్షలు విధించే వారు జడ్జ్ లు. తూర్పు, పడమర లాంటి ఖైదీలు, జడ్జ్ లు ఓకరినొకరు కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇలాగే జరిగింది. ఓ ఖైదీని విడుదల చేస్తున్న విషయం తెలుసుకున్న మహిళ జడ్జ్ ఖైదీ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఆధర్ బూత్ అనే ఖైదీని విచారించిన జడ్జ్ అతన్ని గుర్తుపట్టి తన చిన్ననాటి స్నేహితుడని పలకరించింది. పదినెలల క్రితం మియామీలో చోటుచేసుకున్న ఘటన ఇది.

''మేమిద్దరం కలిసి చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లం, మా స్కూల్ పిల్లలందరిలో ఆథర్ చాలా మంచివాడు'' అని ఆ మహిళా జడ్జి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. జడ్జ్ మెంట్ టైంలో ఆమె  ప్రస్తుత పరిస్థితులన్నింటి నుంచి ఆధర్ బూత్ బయటకు వచ్చి నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఆ జడ్జి అప్పడు ఆకాంక్షించింది. శిక్ష పూర్తవడంతో జైలు నుంచి ఆథర్ విడుదలయ్యాడు. అతడిని కలవడానికి జస్టిస్ గ్లేజర్ జైలుకు వెళ్లారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆథర్ కనబడగానే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆథర్ ఇక నుంచి పరులకు ఉపకారం మాత్రమే చేస్తాడని జస్టిస్ గ్లేజర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జడ్జి గ్లేజర్ తనకు మార్గదర్శకురాలని ఆథర్ తెలిపాడు. మొత్తానికి జడ్జ్ ను, ఖైదీతో చిన్న నాటి స్నేహమే కలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Judge  Miami  Prisoner  Judge Mindly Glazer  

Other Articles