అమితాబ్ బచ్చన్ . ఇది ఇప్పుడు పేరు కాదు. ఓ బ్రాండ్. ఆ పేరు కోసం లక్షల మంది ఆరాటపడతారు. ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి అమితాబ్ బచ్చన్ పై ఈ మధ్యన తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అమితాబ్ విదేశాల్లో డబ్బులు దాచుకున్నాడని పనామా పేపర్స్ వెల్లడించింది. అమితాబ్ తో పాటుగా కోడలు ఐశ్వర్య కూడా ఇందులో ఉందని తేలింది. అమితాబ్ పేరు పనామా పేపర్స్ లో రావడంతో కొన్ని బిజినెస్ బ్రాండ్ లకు దెబ్బతగిలింది. తాజాగా మరోసారి అమితాబ్ ఆస్తుల వివరాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి.
Also Read: బ్లాక్ మనీ జాబితాలో అమితాబ్, ఐశ్వర్య
తాజాగా అమితాబ్ ఏ కంపెనీల్లో డబ్బు దాచుకున్నారో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు మీటింగుల్లో బచ్చన్ పాల్గొన్నట్లు ఓ పత్రిక మరిన్ని ఆధారాలను బయటపెట్టింది. ఈ ఆధారాల్లో అమితాబ్ 1994లో ఆయా కంపెనీలతో టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు జారీ చేసిన సర్టిఫికెట్‌లో డైరక్టర్ల జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉండటం గమనార్హం. పనామా పత్రాల పేరుతో గతంలో విడుదలైన జాబితాలో బిగ్‌బీకి విదేశాల్లో ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట వచ్చిన ఆరోపణలను అమితాబ్ కొట్టివేశారు. ఆ తర్వాత రెండో జాబితా ఆధారాలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఆధారాలపై బిగ్ బీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: బిగ్ బికి పనామా ఎఫెక్ట్.. ఇన్ క్రిడిబుల్ ఇండియా బ్రాండ్ నుంచి అమితాబ్ ఔట్..!
-Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more