కొత్త పేర్లతో నిమిషానికో షాక్ ... క్షణానికో నయా అప్ డేట్ నయీం కేసు పోలీసు విచారణలో గడియ గడియకి మారిపోతున్న సమీకరణాలను కొన్ని మీడియాలు అంతే ఆసక్తికరంగా చూపిస్తున్నాయి. మాజీ మంత్రి, మాజీ డీజీపీ అంటూ ఊదరగొట్టేస్తున్నాయి తప్పించే లింకులు అందుతున్నా ఎక్కడా పేర్లు వెల్లడించేందుకు సాహసం చేయలేకపోతున్నాయి.. ఆస్తులు, చీకటి కార్యకలాపాలు అన్నీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు గోవా దాకా పాకాయి.
నయీం ‘కోకోనట్’ రాసలీలు ఎంతలా అంటే...
ఏమాత్రం బోర్ కొట్టినా అమ్మాయిలను వెంటేసుకుని గోవా చెక్కేసే నయీం... అక్కడ ‘కోకోనట్’ పేరిట ఏర్పాటు చేసుకున్న విలాసవంతమైన గెస్ట్ హౌస్ లో వారితో రాసలీలల్లో మునిగిపోయేవాడంట. గ్రేహౌండ్స్ బుల్లెట్లకు బలైపోయాక పోలీసులకు చిక్కిన ఫర్హానా అతడికి ప్రధాన అనుచరురాలిగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆమెను ‘కోకోనట్’ అంటూ ముద్దుగా పిలుచుకనే నయీం... ఆ పేరునే గోవా సదరు గెస్ట్ హౌస్ కు పెట్టుకున్నాడు. ప్రతిసారీ ఓ కొత్త అమ్మాయితో వెంటేసుకుని వెళ్లే నయీం... అక్కడి గోవా చర్చి పక్కనే ‘చర్చి హౌస్’ పేరిట ఏర్పాటు చేసుకున్న మరో గెస్ట్ హౌస్ లో కీలక ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరిపేవాడట. అమ్మాయిలను వాడుకోవటమే కాదు, వారిని ఆపై అమ్ముకునేవాడని, ఎవరైనా ఎదురుతిరిగితే వారిని శారీరకంగా హింసించేవాడని తెలుస్తోంది. ఒకవేళ లొంగిపోతే మాత్రం వారిపై, వాళ్ల కుటుంబ సభ్యులపై కాసుల వర్షం కురిపించేవాడంట.
నయీం ఒక్కడే కాదు తన అనుచరులను కూడా అక్కడికి పంపించి సుఖ పెట్టించేవాడని గెస్ట్ హౌజ్ వాచ్ మన్ తాజుద్దీన్ పోలీస్ విచారణలో వెల్లడించాడు. ఈ రెండు గెస్ట్ హౌస్ లలో పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. భార్య పిల్లలు ఉన్నప్పటికీ నయీంకి ఉన్న అమ్మాయిల పిచ్చిపై ఫర్హాన్ కు పూర్తి విషయాలు తెలుసని, ఆమెను గట్టిగా విచారిస్తే మరిన్ని బండారాలు బయటపడుతాయని భావిస్తున్నారు.
నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more