Road accident: 10 diead in an accident at nayakan gudem in khammam

Private bus ramps into culvert in khammam 10 dead

road accident in khammam, bus ramps into culvert, another Roadrage in khammam, Private bus, yatra genie travels, hyderabad miyapur-kakinada, nagarjuna sagar culvert, bus turns upside down at nayakan gudem, uncontrollable speed,khammam, 10 dead

Private bus from hyderabad miyapur to kakinada ramps into nagarjuna sagar culvert and turns upside down at nayakan gudem in khammam, 10 dead at the spot

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Posted: 08/22/2016 07:12 AM IST
Private bus ramps into culvert in khammam 10 dead

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుసుమంచి మండల నాయకన్ గూడెం వద్ద కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సది మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికంగా వున్న అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం ముఫై మంది ప్రయాణికులు వున్నారని సమాచారం.

హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్‌ గూడెం వద్ద వున్న మలుపును డ్రైవర్ గమనించకపోవడంతో.. అతివేగంగానే పోనివ్వడం.. మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది.నాగార్జున సాగర్‌ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్‌ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నెల్లూరుకు చెందిన జనార్దన్‌ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయిన బస్సు నెంబర్‌ ఏపీ26 టీసీ9512 పోలీసులు గుర్తించారు. కాగా, ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్‌ తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus accident  khammmam  miyapur-kakinada  nayakan gudem  road accident  

Other Articles