గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో వేగం పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తాజాగా కీలక అడుగువేసింది. నయీంతో చేతులు కలిపి దందాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నయీంను ముందుపెట్టి కోట్లాది రూపాయలు దండుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనగారిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విపక్షంలో ఉన్న ఈ మాజీమాత్యులు గత కొంతకాలంగా అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఆయనను విచారించేందుకు నోటీస్ పంపినట్టు తెలుస్తోంది.
నయీం ఎన్కౌంటర్, సోదాలు, తర్వాతి పరిణామాలతో వణికిపోయిన ఆ నేత బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అధికారంలో ఉన్న పదేళ్లు గ్యాంగ్‌స్టర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు సిట్ దగ్గర పక్కా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. నగరంలో భూమి కనిపిస్తే చాలు, జెండా పాతే అలవాటున్న ఈ మాజీ మంత్రి ఇందుకోసం నయీం సహకారాన్ని వాడుకున్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. నయీం అండదండలతోనే ఆయన చెలరేగిపోయారని చెబుతున్నారు.
మాదాపూర్‌లో పది ఎకరాల భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో నయీం మనుషులను పంపి మాజీ మంత్రి తనను బెదిరించారని ఓ వ్యాపారి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టు సమాచారం. ఆయనతోపాటు విపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా విచారించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more