ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 66 వ పుట్టిన రోజున భారత్ మూడు గిన్నిస్ రికార్డులను లిఖించుకునేందుకు కూడా ఏర్పాటు చేసింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత రెండు జన్మదినానికి లేని కొత్త ఏర్పాట్లను బీజేపి చేస్తుంది. ఇప్పటి వరకు పాశ్చాత దేశాల పేరిట వున్న గిన్నీస్ రికార్డును భారత్ తన పేరున లిఖించాలని భావిస్తుంది. అది కూడా సంక్షేమ కార్యక్రమాలతో ఈ మూడు గిన్నీస్ రికార్డును నెలకొల్పేందుకు బీజేపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో మూడు గిన్నిస్ రికార్డులతో పాటు ఒక జాతీయ రికార్డు ఉన్నాయి. వేడుకలు గుజరాత్లోని నవ్సారి జిల్లాలో నిర్వహిస్తారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న గుజరాత్ రాష్ట్రాన్ని ఇందుకు వేదికగా చేసుకుంది బీజేపి అధిష్టానం. అర్ఎస్ఎస్ అదేశాల నేపథ్యంలో గుజరాత్ లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని.. ఇక్కడ అధికారాన్ని కొల్పోతే.. దాని ప్రభావం దేశవ్యాప్తంగా వుంటుందని హెచ్చిరించిడంతో అందుకు అనుగూణంగా పావులు కదుపుతున్న బీజేపి వికలాంగులకు సాయం అందించడంతో పాటు పనిలో పనిగా వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కూడా చేయనుంది. సెప్టెంబర్ 17 న మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నవ్సారీలో మొత్తం 11,223 మంది వికలాంగులకు 17,000 వీల్చైర్లు, మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.7.5 కోట్లను ఖర్చు చేయనున్నారు.
10000 మంది వికలాంగులకు వీల్ చైర్లు, మరో వెయ్యి మంది వినికిడిలోపం గల వారికి హియరింగ్ మిషిన్లను ఒకే సారి పంపిణీ చేస్తారు. అనంతరం 1500 మంది దివ్యాంగులతో కలిసి దీపాలతో ర్యాలీగా ప్రదర్శనను నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 346 మందికి శారీరక వికలాంగులకు వీల్ చైర్లను అమెరికా అందించగా, ఆస్ట్రేలియా 500 మందికి వినికిడి యంత్రాలను అందించిన రికార్డు ఆయా దేశాల పేరుతో ఉంది. దీంతో ఇప్పటి వరకూ ఆయాదేశాల పేరుతో ఉన్న గిన్నీస్ రికార్డు బద్దలు కానుంది. ఇక ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని కూడా సేవా దివాస్ గా పాటించనున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more