దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ పెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే హత్యకేసులో నమ్మలేని నిజాలు భయటపడుతున్నాయి. అమెను హత్య చేసింది వాచ్ మెన్ రాజ్ కుమార్ సింగ్ అని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో రాజ్ కుమార్ ఒక్కడి ప్రమేయమే తప్ప మరెవరికీ సంబంధం లేదని పోలీసులు తెలిపారు. అయితే రాజ్ కుమార్ ను విచారించిన పోలీసులు విస్తుగోలిపే వాస్తవాలు తెలిసాయి. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు నగ్నంగా చిత్రీకరించాలనుకున్నట్లు చెప్పాడు. అయితే మోనికపై అత్యాచారం చేశాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోడానికి పోలీసులు అతడిని ఇంకా ప్రశ్నిస్తున్నారు.
పంజాబ్‌లోని భటిండాకు చెందిన రాజ్‌కుమార్ (21) గతంలో సప్నా రాజ్ వ్యాలీలో వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. అక్కడే మోనిక మృతదేహం లభించింది. ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి బెంగళూరులో డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బెంగళూరులో రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారంటు మీద గోవాకు తీసుకొచ్చారు. బెంగళూరులో పోలీసులు విచారించినప్పుడే రాజ్‌కుమార్ పలు విషయాలు వెల్లడించాడు. ముందుగానే ఇంటి ఆనుపానులు తెలిసి ఉండటంతో వెనకవైపు ఫెన్సింగ్ దూకి కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. ఆమె ఇంట్లో దోపిడీ చేయాలని వచ్చాడు.
ప్లాట్‌లోకి ప్రవేశించగానే కత్తి చూపించి బెదిరించి, మాట్లాడకుండా ఉండాలని చెప్పాడు. తర్వాత ఆమె చేతులు కట్టేసి, ఏటీఎం కార్డు తీసుకుని.. పిన్ నెంబరు కూడా బలవంతంగా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె దుస్తులు విప్పి సెల్ఫోన్లో షూట్ చేయాలనుకున్నానని, ఆ చిత్రం ఆధారంగా తాను ఆమెను బెదిరించాలనుకున్నానని చెప్పాడు. అయితే నిజంగా అలా షూట్ చేశాడో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. మోనిక ముక్కు, నోరు మూసేసి ఊపరిడాకుండా చేసి చంపేసినట్లు తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more