వాడు న్యాయవాది తక్కువ.. నేరగాడికి ఎక్కువ Husband held for murder of Kanpur magistrate

Husband held for murder of kanpur magistrate

kanpur magistrate suicide, kanpur magistrate murder, kanpur murder, pratibha gautam, manu abhishek, news, latest news, india news, crime, crime news

judicial magistrate Pratibha Gautam was almost four months pregnant and her husband, Manu, wanted her to get an abortion. The two got married in January this year.

వాడు న్యాయవాది కాదు..నేరగాడే.. జడ్జిని హతమార్చాడు..

Posted: 10/11/2016 12:19 PM IST
Husband held for murder of kanpur magistrate

శీర్షిక చూగానే మీకు సందేహం కలిగింది కదూ.. న్యాయశాస్త్రాన్ని అద్యయనం చేసిన వాడు నేరాలు చేయకూడదన్న విషయం కూడా తెలియాలి, కానీ తన భార్య అన్న అహంతో వ్యవహరించి అమెను నిర్థాక్షిణ్యంగా హతమార్చి అత్మహత్యగా చిత్రీకరించిన వాడిని ఏం అనాలి.. అందునా అమె సామాన్యమైన మహిళ కాదు, న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తుంది కూడా, అయినా అమె కన్నా ఉన్నత హోదాల వున్న భార్య కావడంతో అమెను చులకన చేయడం, తన అజమాయిషీ సాగాలని అనునిత్యం వేధింపులకు, గృహహింసకు పాల్పడ్డాడు, వివాహం జరిగి పది నెలలు కూడా తిరగకుండానే అమెను అనంతవాయువులలో కలిపేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం కాన్పూర్ లో ప్రతిభా గౌతమ్ అనే మహిళ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తోంది. అయితే, ఆమె ఇటీవల గర్భం దాల్చగా తనకు ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకోవాలని ఆమె భర్త, న్యాయవాది మను అభిషేక్ రాజన్ ఆమెపై పదేపదే ఒత్తిడి తీసుకురావడంతోపాటు చిత్ర హింసలకు గురిచేశాడు.  అనంతరం గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

కాగా ప్రతిభ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో పోస్ట్ మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. ఆమె శరీరంపై 20 చోట్ల బలమైన గాయాలయ్యాయని, పక్కటెముకలు ఒకవైపు ఎనిమిదిచోట్ల, మరోవైపు ఐదుచోట్ల విరిగిపోయాయని, శరీరంలోని ఇతర ప్రముఖ అవయవాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడని, అనంతరం ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో అతడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manu Abhishek Rajan  Pratibha Gautam  murder  kanpur magistrate  crime  

Other Articles