రాహుల్ అందుకు పనికి రాడంటూ ఏకంగా సోనియాకే వీడియో పంపాడు | Cong leader's clip slamming Rahul Gandhi goes viral

Cong leader s clip slamming rahul gandhi goes viral

congressman tells Sonia to sack Rahul Gandhi, Khoon ki dalali, Rahul Gandhi Khoon ki dalali

congressman tells Sonia to sack Rahul Gandhi.

రాహుల్ అందుకు పనికిరాడంటూ సోనియాకు వీడియో

Posted: 10/12/2016 02:07 PM IST
Cong leader s clip slamming rahul gandhi goes viral

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత శైలేష్ చౌబే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రాజకీయాలకు ఎంతమాత్రం పనికిరాడని... ఆయనను వెంటనే పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఒక వీడియో సందేశాన్ని పంపారు. పార్టీకి ఉపయోగపడని వారు, నాయకత్వ లక్షణాలు లేనివారు కాంగ్రెస్ లో ఉండటానికి వీళ్లేదని వీడియోలో ఆయన స్పష్టం చేశారు.

పాక్ పై భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి... రక్తంతో వ్యాపారం చేస్తున్నారంటూ ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను శైలేష్ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాహుల్ వల్ల కాంగ్రెస్ కు నష్టమే కాని, లాభం లేదని శైలేష్ విమర్శించారు. రాజకీయాల నుంచి తప్పించి రాహుల్ తో ఏదైనా వ్యాపారం పెట్టించాలని సోనియాకు సూచించారు.

కాగా, శైలేష్ ఆ వీడియో సందేశం స్పందిస్తూ... తాను కాంగ్రెస్ కార్యకర్తనని, అధినేత్రి సోనియాపై గౌరవంతోనే తాను ఆ వీడియో పంపానని, ఇంకా రాహుల్ ను రాకీయాల్లో కొనసాగిస్తే మాత్రం కాంగ్ కనుమరుగయిపోవటం ఖాయమని చెప్పుకొచ్చింది. కాగా, శైలేష్ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. శైలేష్ ను కనీసం ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khoon ki dalali  Sonia Gandhi  Rahul Gandhi video  

Other Articles