బెడ్ మీదున్న జయ అధికారం గురించి ఆదేశాలా? | Karunanidhi doubts on Jayalalithaa advise Governor

Karunanidhi doubts on jayalalithaa advise governor

Karunanidhi express doubts on Jayalalitha's illness , Jayalalitha advise governor on ruling, Karunanidhi doubts on Governor Vidyasagar

DMK chief Karunanidhi How could hospitalised Jayalalithaa advise Governor.

జయలలితకు సంతకం చేసే సీన్ ఉందా?

Posted: 10/12/2016 08:14 PM IST
Karunanidhi doubts on jayalalithaa advise governor

అనారోగ్యంతో ఉన్న జయలలిత స్థానే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న అమ్మ అనుచరుడు పన్నీర్ సెల్వంకు అధికారులు బదలాయిస్తూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తమిళనాడు ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ప్రకటనపై డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘జయలలిత ఆదేశాల మేరకు’ ఆర్థికమంత్రి పన్నీర్‌ సెల్వమ్‌ కు శాఖల బదలాయింపు జరిగిందన్న గవర్నర్ ప్రకటనపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

శాఖల బదలాయింపు జరగాలంటూ ఫైల్‌ పై జయలలితే సంతకం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, స్టాలిన్ తదితరులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు జయతో నేరుగా కలిసి మాట్లాడేందుకు ఎందుకు అనుమతించ లేదని కరుణానిధి అధికారులను ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఆమె ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నా ఇంకెంతకాలం ఆమె చికిత్స పొందాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారని సమాచారం. 

అసలు గవర్నర్ రాజ్యాంగంలోని అన్ని కోణాలను పరిశీలించాకే శాఖల బదలాయింపు నిర్ణయం తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇదే సమయంలో శాఖల బదలాయింపును ఆయన కుమారుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ స్వాగతించడం విశేషం. మరోపక్క విపక్షాలన్నీ ఏకమై అమ్మ ఆరోగ్య స్థితి విషమించిందని దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నాడీఎంకే ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karunanidhi  jayalalitha  Health  Governor Vidyasagar  

Other Articles