ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో యాప్ ల ప్రపంచంతో ఏం కావాలన్న క్షణంలో ప్రతీ వస్తువు మన వద్దకే చేరిపోతుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు నాణ్యమైన సేవలను వారి వద్దకే చేరవేస్తూ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కంపెనీ ఇచ్చిన బంఫరాఫర్ యూపీ, ఢిల్లీ ప్రాంతంలో జనాలు చక్కగా వినియోగించుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతకీ అంతటి హాట్ హాట్ సర్వీస్ ఏంటనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.
ప్రస్తుతం ప్రజలంతా బ్యాంకులు, ఏటీఏంల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు, పాత నోట్లను మార్చుకునేందుకు నానా కష్టలు పడుతున్నారు. గంటల తరబడి క్యూలలో నిల్చోవడం వల్ల సమయం వృథా అవుతోందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చింది బుక్మైచోటు డాట్ కామ్ అనే స్టార్టప్ కంపెనీ. పేరు చోటు ఉంది కదా అనుకోకండి. అలాగని ఇది చిన్న పిల్లలను పంపించదండోయ్.. ఖచ్ఛితంగా 18 ఏళ్లకు పైబడిన వారినే పంపిస్తుంది. ఇందుకోసం గంటకు రూ.90 చెల్లిస్తే చాలూ మీ తరపున క్యూలో నిల్చునేందుకు ఓ వ్యక్తిని పంపిస్తామంటూ ప్రకటించింది.
బ్యాంకులు, ఏటీఎం క్యూలలో నిల్చునేందుకు బుక్ చేసుకున్న వారు చివరి నిమిషంలో తప్పకుండా బ్యాంకు, ఏటీఎం వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. తాము పంపిన వ్యక్తులు కేవలం లైన్లో మాత్రమే నిల్చుంటారని పేర్కొంది. సత్జీత్ సింగ్ బేడీ, గోవిన్ కందారి అనే ఇద్దరు వ్యక్తులకు వచ్చిన ఆలోచనే ఇది. ప్రజల క్యూ కష్టాలను తీర్చేందుకు వినూత్న ఆలోచన చేసామని వారు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే బుక్‌మై చోటు సేవలు ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాను రాను సేవలను మరింత విస్తరిస్తామని వారు చెబుతున్నారు.
ఇంతకీ బుక్‌మై చోటులో హెల్పర్‌ను బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. లేదా +91-8587028869 అనే నంబరుకు కాల్ చేయాల్సి ఉంటుంది. అన్నట్లు ఈ సేవలు ఒక్క క్యూలైన్లకే పరిమితం కాదు.. ఇల్లు మారడం దగ్గరి నుంచి ఇంటికి సరుకులు తెచ్చివ్వడం వరకు అన్నింటికీ ఈ సైట్ ద్వారా హెల్పర్లను బుక్ చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more