జయ బతికే ఉందా? మధ్యాహ్నం 12కి అపోలో క్లారిటీ | Apollo statement on Jayalalithaa's cardiac Arrest.

Security outside apollo beefed up supporters pray for amma

Tamil Nadu CM, Jayalalitha, Jayalalitha's ill, Roads To Apollo Hospital Blocked, Mass Prayers For Jayalalithaa, Apollo Hospital Jayalalitha, Jayalalithaa's Health, Chennai Bandh, Tamil Nadu Jayalalithaa, Cardiac Device for Jayalalithaa

Roads To Apollo Hospital Blocked, Mass Prayers For Jayalalithaa's Health.

అపోలో వద్ద హైడ్రామా... కాసేపట్లో ప్రకటన?

Posted: 12/05/2016 10:04 AM IST
Security outside apollo beefed up supporters pray for amma

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తతో తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ పక్క రాష్ట్రాలకు సైతం కేంద్రం సూచనలు జారీ చేసింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటికే హోం శాఖ నుంచి అలర్ట్ సందేశాలు అందాయి. తమిళనాడులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను సాకుగా తీసుకుని ఆస్తుల విధ్వంసానికి ఎవరు దిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇక కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి నెల్లూరు చిత్తూరు రీజియన్ల నుంచి చెన్నైకి బస్సులను తిప్పుతున్నామని, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిన విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ ఆర్.విద్యాసాగర్‌రావు చెన్నై చేరుకుని అపోలో ఆస్పత్రిని సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. జయ ఆరోగ్యంపై ఆయన ప్రకటన చేస్తారని ఆస్పత్రి బయట ఎదురుచూస్తున్న వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావించారు. అయితే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. గవర్నర్ రాజ్‌భవన్‌కు చేరుకున్నాక ప్రకటన చేసే అవకాశముందని భావించినా ఇప్పటి వరకు రాజ్‌భవన్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే మరికొద్ది సేపట్లో ఆయన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేయవచ్చని సమాచారం.

మధ్యాహ్నంలోపు ప్రకటన...
ఈ మధ్యాహ్నం 12 గంటలకు అపోలో డాక్టర్లు విడుదల చేసే ఆరోగ్య బులెటిన్ లో ఎలాంటి అశుభ వార్తా ఉండరాదని అమ్మ అభిమానులు, కార్యకర్తలూ కోరుకుంటున్నారు. బులెటిన్ విడుదలకు ముందు ఎయిమ్స్ వైద్యుల సలహాను తీసుకోవాలని జయలలితకు చికిత్స చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క గుండె సంబంధిత పరికరం(ఎక్మో) తో ఆమెకు చికి్త్స అందిస్తున్నట్లు వార్త ఒకటి బయటికి పొక్కింది.

అసలేం జరిగింది...
- ఆదివారం సాయంత్రం 6 గంటలకు జయలలితకు గుండెపోటు
- రాత్రి 7:45కు వార్త బయటకు పొక్కింది
- పావు గంటలోనే అంటే 8 గంటలకే పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు జనం చేరిపోయారు. ఆపై టీవీల్లో స్క్రోలింగ్ లు, ప్రత్యేక వార్తలు
- 9 గంటలకు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. స్వల్ఫ లాఠీ చార్జీ.
- 9:30కి ప్రత్యేక బులెటిన్ విడుదల చేసిన అపోలో.. అమ్మకి గుండెపోటు నిజమేనని ప్రకటన.
- అర్ధరాత్రి 12:03 నిమిషాలకు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆస్పత్రికి వచ్చి దాదాపు పది నిమిషాలు వైద్యలతో మాట్లాడి అనంతరం 12:14కు రాజ్ భవన్ కు పయనం
- 12:30కి విద్యాసాగర్ రావును కలసిన డీజీపీ, ఆపై ప్రత్యేక బలగాలు పంపాలని కేంద్రానికి వినతి
- ఉదయం 5.45 నుంచి గ్రామ స్థాయి నుంచే బలగాల మోహరింపు, పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు.
- అపోలో వద్ద అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన.. అరెస్టులు మొదలు
- తిరువణ్ణామలై ప్రాంతంలో కర్ణాటకకు చెందిన బస్సును దహనం.. సర్వీసులు రద్దు చేసిన కర్ణాటక
- అపోలో రూట్లన్నీ మూసివేత
- మధ్యాహ్నం 12 గంటలకు బులెటిన్ విడుదల చేస్తామన్న అపోలో వైద్యులు

అపోలో టూ పోయిస్ గార్డెన్ మూసివేత...
ప్రస్తుతం తమిళసీమలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న చందాన ఉంది. అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ నూ ఖాళీ చేయించిన పోలీసులు, ఈ పరిధిలోని అన్ని షాపులనూ మూసివేయించారు. దీంతో దాదాపు 12 కిలోమీటర్ల పరిధిలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అపోలోకు దారితీసే ఏ రహదారిలోనూ వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతించడం లేదు.

ఆస్పత్రి నుంచి జయలలిత అధికారిక నివాసం పోయిస్ గార్డెన్ రూట్ లో రాకపోకలు బంద్ అయిపోయాయి. మొత్తాన్నీ పోలీసులు, భద్రతా దళాలు తమ అధీనంలోకి తెచ్చుకోవడం చెన్నైలో కలకలం రేపుతోంది. ఈ రహదారిపైకి ఎవరూ రావద్దని, చుట్టుపక్కల ప్రజలు ఇళ్లు దాటవద్దని మైకుల్లో ఎనౌన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయి, ఆపై నేతలకు మాత్రమే అపోలో వద్దకు వెళ్లే వీలు కలుగుతోంది. మిగతా చోటా నేతలు, కార్యకర్తలూ ఆసుపత్రికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalitha  Cardiac arrest  

Other Articles